వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు..కలలో కూడా ఊహించలేరు: యూటర్న్ రికార్డు ఆయనదే: సాయి రెడ్డి సెటైర్లు..!

|
Google Oneindia TeluguNews

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి తన ట్వీట్లు కంటిన్యూ చేస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభిస్తున్న రైతు భరోసా కింద రూ 5,500 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. దీని పైన విజయ సాయిరెడ్డి తాజాగా ట్వీట్ చేసారు. అందులో ..వైఎస్సార్ రైతు భరోసా పథకం అమలు కోసం ముఖ్యమంత్రి గారు రూ.5510 కోట్లు విడుదల చేశారు. 50 లక్షల రైతు కుటుంబాలకు, కౌలు రైతులకు రూ.12,500 చొప్పున సాయం అందుతుంది. నోరు పెగలడం లేదు కదా చంద్రబాబు గారు... మీరు కలలో కూడా ఊహించి ఉండరు రైతులను ఈ విధంగా ఆదుకోవచ్చని .. అంటూ సాయిరెడ్డి ట్వీట్ చేసారు.

అదే విధంగా చంద్రబాబు మీద గత ఎన్నికల సమయం ముందు నుండి యూ టర్న్ బాబు అంటూ వైసీపీ నేతలు విమర్శిస్తూనే ఉన్నారు. దీని పైన విజయ సాయిరెడ్డి మరో ట్వీట్ చేసారు. యూ-టర్న్ అనే పదం 1930 ప్రాంతంలో వాడుకలోకి వచ్చిందని ప్రఖ్యాత ఇంగ్లిష్ డిక్షనరీ చెబ్తోందని. ఇప్పటి దాకా లెక్కలేనన్ని సార్లు దాన్ని ఆచరణలో పెట్టిన రికార్డు చంద్రబాబు గారిదే. .. అవకాశంవాదం, కాళ్లు పట్టుకోవడం తప్ప ఒక సిద్ధాంతం అంటూ లేని నాయకుడు ఇతనొక్కడే..అంటూ సాయిరెడ్డి తన ట్వీట్ లో ఎద్దేవా చేసారు.

Vijaya Sai Reddy Tweets against Chandra babu and Pawan Kalyna became political controversy

ఇక, విశాఖ పార్టీ సమావేశంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యల మీద విజయ సాయిరెడ్డి స్పందించారు. మరో ట్వీట్ లో ..మోదీ రాక్షసుడు, దేశానికి పట్టిన శని, భార్యను వదిలేసిన బాధ్యత లేని వ్యక్తి అని అనేక రకాలుగా దూషించిన చంద్రబాబు.. ఇప్పుడు ఆయనతో వ్యక్తిగత విభేదాలేమీ లేవని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు... మోదీని గద్దె దింపడం కోసమే కాంగ్రెస్ తో చేతులు కలిపినట్టు చెప్పిన విషయాన్ని ఎవరూ మర్చిపోరు...అంటూ ట్వీట్ చేసారు. ఇక, దీనికి కొనసాగింపుగా తాజా ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాక లో తాను ఎందుకు ప్రచారం చేయలేదో పార్టీ నేతలకు చంద్రబాబు వివరించారు.

దీనికి స్పందనగా విజయ సాయిరెడ్డి తన ట్వీట్ లో .. హుందాగా ఉండాలని పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాకలో ప్రచారానికి వెళ్లలేదట చంద్రబాబు గారు... ఆయన కూడా హుందాగానే మాలోకం నిలబడిన మంగళగిరి మొహం చూడలేదేమో... ఆవిధంగా తామిద్దరం పార్టనర్లమని బయట పెట్టుకున్నారు... చీకటి పొత్తుల విషయాన్ని ప్రజలు గ్రహించబట్టే గట్టి గుణపాఠం చెప్పారు...అంటూ విజయ సాయి రెడ్డి తన వరుస ట్వీట్ల ద్వారా సెటైర్లు వేసారు. దీని మీద టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

English summary
YCP Rajyasabha member Vijaya Sai Reddy Tweets against Chandra babu and Pawan Kalyna became political controversy. Saireddy tweeted about funds released by ap govt for Rythu Bharosa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X