విజయమ్మ సంచలనం- ప్రత్యేక సమావేశం : జగన్-షర్మిల లేకుండా-వారికే ఎంట్రీ..!!
వైఎస్సార్ వర్దింతి నాడు కీలక పరిణామం చోటు చేసుకోబోతంది. ఇప్పటికే ఏపీలో జగన్ - తెలంగాణలో షర్మిల విడివిడా రెండు పార్టీలతో రాజకీయం కొనసాగిస్తున్నారు. జగన్ అంగీకారం లేకుండానే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టారని స్వయంగా జగన్ సలహాదారులే చెప్పుకొచ్చారు. షర్మిల తెలంగాణలో రాజకీయ ఎంట్రీ తరువాత తల్లి విజయమ్మ ఎక్కువగా కుమార్తె షర్మిలతోనే ఉంటూ వస్తున్నారు. ఇద్దరూ అన్న- చెల్లెలు తమ తండ్రి జన్మదినం అయిన జూలై 8న ఇడుపులపాయలో కలుస్తారని అందరూ భావించారు.

ఆ రోజు కలవని అన్నా- చెల్లెలు..
అయితే, షర్మిల రాక సమయం తెలుసుకున్న సీఎం జగన్ తన షెడ్యూల్ మార్చుకున్నారు. ఆ తరువాత ఆయన క్యాంపులోని నేతలు వివరణ ఇచ్చారు. ఎక్కడా ఎటువంటి అనుమానాలకు తావివ్వకూడదనే ఉద్దేశంతోనే జగన్ సమయం మార్చుకొని వైఎస్సార్ ఘాట్ కు వెళ్లారని చెప్పుకొచ్చారు. ఇక, ప్రతీ ఏటా రాఖీ పండుగ నాడు షర్మిల తన అన్న జగన్ కు రాఖీ కట్టటం ఆనవాయితీ. తాను రాజకీయంగా తెలంగాణలో పార్టీ పెట్టినా...తనకు ఈ జన్మకు జగన్ అన్న అని..రాఖీ లాంటివి కంటిన్యూ అవుతాయని పార్టీ ఏర్పాటుకు ముందు షర్మిల వెల్లడించారు.

జగన్‌కు షర్మిల ట్విట్టర్ శుభాకాంక్షలు
కానీ, రాఖీ నాడు మాత్రం కేవలం ఒక ట్వీట్ తో తన అన్నకు శుభాకాంక్షలు చెప్పారు. పార్టీ నేతలకు మాత్రం రాఖీ కట్టారు. ఇక, వీరిద్దరి గురించి వైఎస్సార్టీపీ ఆవిర్భావ సభలో విజయమ్మ కీలక వ్యాఖ్యలు చేసారు. అన్నా-చెల్లెల్లె చెరో రాష్ట్రంలో ఉండటం..రెండు పార్టీలకు నాయకత్వం వహించటం దేవుడి నిర్ణయమే అంటూ వ్యాఖ్యానించారు. అయితే, ఇప్పుడు టీడీపీ నేతలు షర్మిల కొత్త పార్టీ అంశాన్ని తమకు మలచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. షర్మిలకు జగన్ అన్యాయం చేసారని..అందుకే కొత్త పార్టీ పెట్టుకున్నారంటూ విమర్శలు చేస్తున్నారు.

వైఎస్సార్ వర్దంతి నాడు ఇడుపులపాయకు జగన్..
ఇక, మరో మూడు రోజుల్లో సెప్టెంబర్ 2న వైఎస్సార్ వర్దంతి. ఆ రోజు తిరిగి కుటుంబ సభ్యులు ఇడుపుల పాయలో వైఎస్సార్ కు నివాళి అర్పించాల్సి ఉంది. ఇందు కోసం ఇప్పటికే జగన్ రెండు రోజుల కడప జిల్లా పర్యటన ఖరారైంది. ప్రస్తుతం సిమ్లా పర్యటనలో ఉన్న సీఎం జగన్ సెప్టెంబర్ 1, 2 తేదీల్లో పులివెందులలో ఉండనున్నారు. ఇక, షర్మిల ఇడుపులపాయకు ఆ రోజు వస్తారా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఇదే సమయంలో విజయమ్మ తమ కుటుంబ సన్నిహితులకు కీలక ఆహ్వానం పంపారు.

ఆత్మీయులతో విజయమ్మ భేటీ వెనుక..
సెప్టెంబర్ 2న వైఎస్సార్ వర్దంతి సందర్భంగా ఆ రోజు సాయంత్రం హెచ్ఐసీసీ నోవాటెల్ లో సంస్మరణ సభ ఏర్పాటు చేసారు. ఇది రాజీయాలకు- పార్టీలకు అతీతంగా జరుగుతున్న సమావేశంగా ఆహ్వానంలో పేర్కొన్నారు. దీని ద్వారా జగన్ - షర్మిల మధ్య ఉన్న విభేదాల గురించి జరుగుతున్న ప్రచారానికి ముగింపు పలకాలనే ఉద్దేశంతో విజయమ్మ ఈ సమావేశం ఏర్పాటు చేసారా అనే చర్చ మొదలైంది. అయితే హైదరాబాద్ లో ఏర్పాటు చేయటం వెనుక ఉద్దేశం ఏంటనే చర్చ కంటిన్యూ అవుతోంది.
Recommended Video

విజయమ్మ ఆత్మీయ సమావేశం పై రాజకీయంగా ఆసక్తి..
జగన్ ఈ సమావేశం ఏర్పాటు చేయించారా..లేక షర్మిల సూచనతో విజయమ్మ ఈ మీటింగ్ పెడుతున్నారా అంటూ ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. కానీ, వైఎస్సార్ అభిమానులకు షర్మిల ఈ సమావేశం ద్వారా ఏం తమ కుటుంబంలో ఏం జరిగిందో వివరణ ఇవ్వటానికే అంటూ మరో వాదన మొదలైంది. దీంతో..సెప్టెంబర్ 2న ఇడుపులపాయకు జగన్ - షర్మిల రాక గురించి ఒక ఆసక్తి కంటిన్యూ అవుతుంటే..మరో వైపు విజయమ్మ ఇలా ఆత్మీయుల సమావేశం ఏర్పాటు చేయటం మరో ఇంట్రస్టింగ్ అంశంగా మారుతోంది. ఈ సమావేశం పైన అటు వైసీపీ అభిమానుల్లో..ఇటు వైఎస్సార్టీపీ నేతలతో పాటుగా పొలిటికల్ సర్కిల్స్ లో నూ ఆసక్తి కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications