జగన్ ఆనందంలో విజయమ్మ నిజాలు: రాజేంద్ర ప్రసాద్

సిడబ్ల్యూసి విభజన నిర్ణయం ముందే తెలిసి తమ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించామని విజయమ్మ చెప్పారని విమర్శించారు. సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నేతల రాజకీయ జీవితాల అంతిమయాత్రకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏర్పాట్లు చేశారన్నారు.
జగన్ పార్టీ, కాంగ్రెసుల మధ్య క్విడ్ ప్రోకో జరిగిందన్నారు. విభజన విషయంలో తెలుగుదేశం పార్టీని విమర్శిస్తున్న వైయస్ విజయమ్మ ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని, సోనియా గాంధీని ఎందుకు విమర్శించడం లేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
విభజన విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పూటకోమాట మాట్లాడుతోందన్నారు. పూటకో మాట మాటలాడుతూ ఫోర్జరీ, చీటింగ్ చెక్కులు ఇస్తోంది ఆ పార్టీయే అన్నారు. విజయమ్మ ఢిల్లీ వెళ్లినా కాంగ్రెసు పెద్దలను విమర్శించడం లేదని అందుకు ఆ పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ కారణమన్నారు.












Click it and Unblock the Notifications