420 కేసుకు అర్హుడే: చంద్రబాబుపై విజయసాయి, నమ్మకద్రోహమన్న ధర్మాన

అనంతపురం/ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 86మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వ విధానాలే కారణమని దుయ్యబట్టారు.

చంద్రబాబునాయుడు బేషరతుగా రైతు, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేయాల్సిందేనని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు అబద్ధాల బాబుగా మారిపోయాడని విమర్శించారు. భారత చట్టాల ప్రకారం ప్రజలను మోసం చేసిన చంద్రబాబునాయుడు 420 కేసుకు అర్హుడేనని అన్నారు.

బినామీ ఆస్తుల పరిరక్షణకే చంద్రబాబు సింగపూర్, జపాన్ పర్యటనలు చేశారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. చంద్రబాబుకు ప్రజాప్రయోజనాల కంటే వ్యాపార ప్రయోజనాలే ముఖ్యమయ్యాయని మండిపడ్డారు.

Vijayasai and Dharmana fires at Chandrababu

రైతు రుణాలన్నీ మాఫీ చేయాల్సిందే: ధర్మాన

పశ్చిమగోదావరి: ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న విధంగా తెలుగుదేశం ప్రభుత్వం మొత్తం రైతు రుణాలను మాఫీ చేయాల్సిందేనని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ధర్మాన ప్రసాదరావు, కొత్తపల్లి సుబ్బరాయుడు, ఆళ్లనాని డిమాండ్ చేశారు.

వారు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు వ్యవసాయ, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పిన టిడిపి.. ఇప్పుడు రూ. 5వేల కోట్ల రూపాయలకు కుదించడం సరికాదన్నారు. రుణమాఫీ చేస్తారని ప్రజలు నమ్మి ఓట్లు వేసి అధికారమిస్తే చంద్రబాబునాయుడు నమ్మక ద్రోహం చేశారని డిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలు నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని నేతలు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+