Amaravati Bill: అమరావతి గొంతుకనవుతా..! సాయిరెడ్డి బిగ్ ట్విస్ట్..!
ఏపీ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంట్ లో రాష్ట్ర విభజన చట్టాన్ని సవరించే ప్రక్రియ కొనసాగుతోంది. నిన్న లోక్ సభలో అమరావతి బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించిన కేంద్రం.. ఇవాళ రాజ్యసభలోనూ ఈ తంతును పూర్తి చేస్తోంది. అనంతరం రాష్ట్రపతి ఆమోదంతో అమరావతి శాశ్వత రాజధానిగా మారేందుకు మార్గం సుగమం కానుంది. ఈ నేపథ్యంలో అమరావతి బిల్లును వైసీపీ లోక్ సభ, రాజ్యసభలోనూ వ్యతిరేకిస్తూ వాకౌట్ చేసింది. అదే సమయంలో పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (vijayasai reddy) కూడా ఈ బిల్లుపై స్పందించారు..
అమరావతి బిల్లును పార్లమెంట్ ఆమోదిస్తున్న నేపథ్యంలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన.. అమరావతిని రాజధానిగా ప్రకటించేందుకు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి చేసే సవరణ రాజకీయ చర్చకు ముగింపు పలకవచ్చని అభిప్రాయపడ్డాహరు. సమాజంలోని అన్ని వర్గాల కోసం ఉద్దేశించిన, అందరి కోసం నిర్మించబడిన, ఉత్తమ మెట్రో నగరాలతో పోటీపడగల నిజమైన సామాజిక న్యాయ ప్రతినిధి అయిన సమ్మిళిత రాజధాని ఏపీకి నిస్సందేహంగా అవసరమన్నారు.

The amendment to the AP Reorganisation Act to designate Amaravati as the capital may settle the political debate. AP undoubtedly deserves an inclusive capital meant for all sections of society and true representative of social justice built for all, capable of competing with…
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 2, 2026
కానీ రైతుల హక్కులు, రైతులకు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసిన ప్లాట్ల పంపిణీ, రైతులకు వార్షిక కౌలు చెల్లింపు, మధ్యవర్తులకు కాకుండా అసలు హక్కుదారులకే నష్టపరిహారం, భూసేకరణ చట్టం 2013 ప్రకారం నష్టపరిహారం, దళితులు, పేదలు, అణగారిన వర్గాలకు రద్దు చేయబడిన రూ. 50,000 పట్టాలను పునరుద్ధరించడం, క్షేత్రస్థాయి మౌలిక సదుపాయాలు, ఉద్యోగాల కల్పన వంటి కీలక సమస్యలను పరిష్కరించినప్పుడే న్యాయం జరిగినట్లుగా భావించవచ్చని సాయిరెడ్డి తెలిపారు. ఈ విషయంలో అన్యాయానికి గురైన వారి గొంతుకను తాను వినిపిస్తూనే ఉంటానన్నారు.
మొత్తానికి వైసీపీ ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకించినా, సాయిరెడ్డి మాత్రం బిల్లును సమర్థిస్తూనే బాధితుల తరఫున గొంతు వినిపిస్తానని చెప్పడం విశేషం. మరో ట్వీట్ లో.. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని బిల్లు ను ఆమోదించిన కేంద్రప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి నాది ఒక సూచన. మీరు కట్టేది అమరావతే తప్ప, కమరావతి కాకుండా చూచుకోండి. తస్మాత్ జాగ్రత్త! అని సాయిరెడ్డి తెలిపాారు.












Click it and Unblock the Notifications