జగన్ శత్రువు కాదు, సజ్జల మళ్లీ కెలికితే అవన్నీ బయటికి ? సాయిరెడ్డి వార్నింగ్..!
ఇవాళ కొత్త పార్టీ ప్రకటించేందుకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy).. తన మాజీ పార్టీ అధినేత వైఎస్ జగన్, పార్టీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణపై కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తాను పార్టీ పెట్టడం లేదన్నారు. టీడీపీ, వైసీపీలు తనకు రాజకీయ ప్రత్యర్దులు మాత్రమేనన్నారు. తనకు శత్రువులు లేరన్నారు. జగన్ కోటరీ కూడా తనకు ప్రత్యర్థులే కానీ శత్రువులు కాదన్నారు.
వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కేఏ పాల్ తో తనను పోల్చడంపై స్పందించారు. కేఏ పాల్ మంచోడు కాదనేది బొత్స అభిప్రాయమా అని ప్రశ్నించారు. గతంలో విజయమ్మపై ఆయన చేసిన ఆరోపణలు గుర్తుచేసుకోవాలన్నారు. ఉమ్మడి ఏపీలో రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేసి, వైఎస్సార్ చనిపోయాక ఏం మాట్లాడారో ఓసారి పరిశీలించారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తాను పనిచేశానని, వైఎస్ కుటుంబం కోసం 40 ఏళ్లు పనిచేశానని, అయితే ఏ కారణాల వల్ల తాను పార్టీ నుంచి బయటికి వచ్చానో, తనను ఎలా గెంటేశారో బహిరంగ లేఖ ద్వారా ఇప్పటికే వెల్లడించినట్లు తెలిపారు.

తాము అమాయకులమని, తమది మంచి కోటరీ అని చెబితే, మరో బహిరంగ లేఖ ద్వారా మరిన్ని విషయాలు వెల్లడిస్తానని సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. కోటరీగా తనను రెచ్చగొట్టి, తాను నమ్మక ద్రోహి అని చెప్తే వారిని ఎలా కౌంటర్ చేయాలో ఆలోచిస్తానన్నారు. జగన్ నుంచి రెండేళ్లుగా తనకు ఎలాంటి ఫోన్ కాల్ లేదని, చంద్రబాబు నుంచీ ఆహ్వానం లేదన్నారు. తన పొలిటికల్ గాడ్ ఫాదర్స్ ఏపీ ప్రజలే అన్నారు. ఎన్నికల కోసం తాను పాదయాత్ర చేస్తానని, అయితే రోడ్లపై నడవబోనని, 660 మండలాల్లో ప్రజల మధ్య పాదయాత్ర చేస్తానన్నారు. అడవుల్లో, హైవేల్లో చేయనన్నారు. గిన్నిస్ బుక్ రికార్డుల కోసం పాదయాత్రలు చేయనన్నారు. వైసీపీని వీడే ముందు గతేడాది జనవరి 24న జగన్ తో తాను ఫోన్ కాల్ లో మాట్లాడానని, ఆ తర్వాత ఎవరితోనూ మాట్లాడలేదన్నారు.













Click it and Unblock the Notifications
