చంద్రబాబు చచ్చిన పాముతో సమానం..ఎక్కడికెళ్ళినా పీకేదేం లేదు: విజయసాయి రెడ్డి ధ్వజం

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడిని ఒక చచ్చిన పాముతో పోల్చారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైసిపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు.

నన్నెవరూ భయపెట్టలేరంటూ చంద్రబాబు వ్యాఖ్యలపై ఎంపీ సటైర్

నన్నెవరూ భయపెట్టలేరంటూ చంద్రబాబు వ్యాఖ్యలపై ఎంపీ సటైర్

ఎన్నికల్లో ఓడిపోయిన అప్పటినుంచి నేను ఎవరికీ భయపడను, నన్నెవరూ భయపెట్టలేరంటూ చంద్రబాబు తెగ గింజుకుంటున్నాడని పేర్కొన్న విజయసాయిరెడ్డి చంద్రబాబు నువ్వు చచ్చిన విష సర్పానివి .నిన్ను ఎవరు ఎవరూ భయపెట్టడం లేదు. ఎన్నికల్లో చిత్తుగా ఓడిన తర్వాత అది మరింత ముదిరింది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు విజయ సాయి రెడ్డి. ఇదే సమయంలో కుప్పం వెళ్ళిన చంద్రబాబు ఇది పుంగనూరు ,కడప ,పులివెందుల కాదు ఖబడ్దార్ అన్నాడు .

విద్వేషాలు రెచ్చగొట్టటమే నీ పనా ? బాబు ఫైర్

విద్వేషాలు రెచ్చగొట్టటమే నీ పనా ? బాబు ఫైర్

ఉత్తరాంధ్ర కు వచ్చి ఇది రాయలసీమ కాదు మీ ఆటలు సాగవు అంటాడు. మంచివారు, చెడ్డవారు ప్రాంతాలవారీగా ఉంటారా బాబూ ? అంటూ ప్రశ్నించారు. ప్రాంతాలు ,కులాలు, మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడమే నీ పనా ? అని ప్రశ్నించిన విజయసాయిరెడ్డి నీవు ఎక్కడికి వెళ్ళినా పీకేది ఏమీ లేదు అంటూ చంద్రబాబు నాయుడును ఉద్దేశించి విమర్శలు చేశారు. అంతకుముందు డబ్బు మద్యం బెదిరింపులకు ప్రజలు లొంగే వారే అయితే నువ్వే శాశ్వతంగా ఉండేవాడివి చంద్రబాబు అంటూ పేర్కొన్న విజయసాయి రెడ్డి అవి నీ మార్క్ నీచ రాజకీయాలు అంటూ మండిపడ్డారు.

ఈ బలుపే కదా నిన్ను 23కు పరిమితం చేసింది

ఈ బలుపే కదా నిన్ను 23కు పరిమితం చేసింది

40 శాతం పంచాయతీలలో టీడీపీ మద్దతుదారులు గెలిచారని చెబుతూనే అధికారుల గుడ్డలూడదీసి కొడతా అంటున్నావు ఈ బలుపే కదా నిన్ను 23 కు చేర్చింది చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు వార్డు సభ్యులను కూడా సర్పంచులు గా లెక్క చేసుకున్నావు చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు విజయ సాయి రెడ్డి. టీవీ చర్చలో తన పార్టీ నాయకుడు బిజెపి నేతపై చెప్పుతో దాడి చేయడం చూసి చంద్రబాబు ప్రశాంతంగా నిద్రపోయి ఉంటాడని ఆయన కోరుకునేది ఇలాంటివే అని విజయసాయి పేర్కొన్నారు.

కుప్పం పర్యటన నేపధ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలకు సెటైర్లు

కుప్పం పర్యటన నేపధ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలకు సెటైర్లు

పంచాయితీ ఎన్నికల్లో కనీసం పది ప్రాణాలైనా పోలేదని నిరాశ చెంది ఉంటాడు. టీవీ స్క్రీన్ మీదే అయినా దాడి దృశ్యం హుషారు తెప్పించి ఉంటుంది అంటూ వ్యాఖ్యానించారు. తాజాగా చంద్రబాబు కుప్పం పర్యటన నేపధ్యంలో, చంద్రబాబు వ్యాఖ్యలపై సెటైర్లు వేస్తున్నారు విజయసాయి రెడ్డి .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+