Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వేమిరెడ్డి పోటీకి అనర్హులా - ఏం జరుగుతోంది...!?

ఏపీ ఎన్నికల్లో నెల్లూరు రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. నెల్లూరు ఎంపీగా వైసీపీ నుంచి సాయిరెడ్డి, టీడీపీ నుంచి వేమిరెడ్డి పోటీ చేస్తున్నారు. వేమిరెడ్డి వైసీపీ నుంచి టీడీపీలో చేరిన తరువాత లెక్కలు మారుతున్నాయి. టీడీపీ మెజార్టీ సీట్ల గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. నెల్లూరు వైసీపీకి కంచుకోటగా సాయిరెడ్డి చెబుతున్నారు. ఇదే సమయంలో ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నామినేషన్ పైన ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సాయిరెడ్డి చేసిన ఫిర్యాదు సంచలనంగా మారుతోంది.

వేమిరెడ్డి పై ఫిర్యాదు
నెల్లూరు ఎంపీగా సాయిరెడ్డి వర్సస్ వేమిరెడ్డి రాజకీయ పోరు పతాక స్థాయికి చేరింది. నామినేషన్ల పరిశీలనలో భాగంగా వైసీపీ ఎంపీ అభ్యర్ది విజయ సాయిరెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలిసారు. వేమిరెడ్డి పైన ఫిర్యాదు చేసారు. వేమిరెడ్డిని పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. వేమిరెడ్డి జాతీయ, అంతర్జాతీయ లావాదేవీలను ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొనలేదని వివరించారు.

Vijayasai Reddy complains to Election RO over Vemireddy Prabhakar Reddy Election Nomination

సింగరేణి వంటి ప్రభుత్వ రంగ సంస్థల కాంట్రాక్టులు చేసిన వారు పోటీకి అర్హులు కాదని సాయిరెడ్డి పేర్కొన్నారు. పలు కాంట్రాక్టుల గురించి ఎన్నికల ఆస్తులు, అప్పుల నివేదికలో పొందుపర్చలేదని సాయిరెడ్డి ఫిర్యాదు చేసారు. అయితే, ఎన్నికల అధికారి ఫిర్యాదును తిరస్కరించారు.

అధికారంలోకి వస్తున్నాం
దీని పైన న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటామని సాయిరెడ్డి వెల్లడించారు. వైయ‌స్ఆర్‌సీపీకి వెన్నుపోటు పొడిచి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి టీడీపీలోకి వెళ్లారని మండిపడ్డారు. అత్యంత ధనవంతుడైన వేమిరెడ్డి నాసిరకం కాంట్రాక్టులు చేసి.. ప్రజల సొమ్మును పరోక్షంగా దోచుకున్నారని విమర్శించారు.

విద్యను వ్యాపారం చేసి మహిళలను నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి నారాయణ మోసం చేశారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. పెత్తందారులు ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నాని సాయిరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోనే పుట్టి పెరిగిన పేదవాడైన ఖలీల్ అహ్మద్ కు సీఎం వైయ‌స్ జగన్ ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించారన్నారు.

Vijayasai Reddy complains to Election RO over Vemireddy Prabhakar Reddy Election Nomination

నెల్లూరులోనే ఉంటాను
పెత్తందారులు కావాలో లేదా మీతో కలిసి వుండే వాళ్ళు కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలిని సూచించారు. ఎన్నికల తర్వాత నెల్లూరును విడిచి వెళ్తానని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల తర్వాత వేమిరెడ్డి, నారాయణలు వ్యాపారాలను చూసుకుంటారని, తాను నెల్లూరులోనే స్థిర నివాసం ఏర్పరచుకుని ఇక్కడే ఉంటానని చెప్పారు. నెల్లూరులో దుర్మార్గం రౌడీయిజాలకు స్థానం లేకుండా చేస్తానన్నారు.

నెల్లూరులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రూప్ కుమార్ యాదవ్ లు రౌడీలని వ్యాఖ్యానించారు. ఐదేళ్లలో ఇచ్చిన హామీలన్నీ సీఎం జగన్ నెరవేర్చారన్నారు. బీజేపీతో జత కట్టడమే టీడీపీ చేసిన పెద్ద తప్పుగా సాయిరెడ్డి చెప్పుకొచ్చారు. గతంలో కూడా చంద్రబాబు తప్పు అని చెప్పి మళ్ళీ వాళ్లతో కలిశారన్నారు. ముస్లింల రిజర్వేషన్లను వెనుక తీసుకుంటామని టీడీపీ, బీజేపీ పార్టీలు చెప్పాయ‌ని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+