వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ 600మందికి న్యాయం చేయండి: నిర్మలా సీతారామన్‌ను కలిసిన విజయసాయి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను వైయస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డితోపాటు 600 మంది ఎక్స్‌అప్రెంటిస్‌ ఉద్యోగులు గురువారం కలిశారు. ఈ సందర్భంగా ఆ ఉద్యోగులకు న్యాయం జరిగేలా కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని విజయసాయి రెడ్డి.. నిర్మలా సీతారామన్‌ను కోరారు.

గురువారం నేవల్‌ డాక్‌ యార్డు అప్రెంటీస్‌ అసోసియేషన్‌ సభ్యులతో కలిసి విజయసాయి, నిర్మలా సీతారామన్‌ను కలిశారు. అనంతరం విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈస్ట్రన్‌ నావల్‌ కమాండ్‌లో 600మంది ఎక్స్‌ అప్రెంటిస్‌లకు న్యాయం చేయాలని రక్షణ మంత్రిని కోరినట్లు తెలిపారు. ఇందుకు స్పందించిన మంత్రి.. వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని చెప్పారు.

Vijayasai Reddy and ex apprentices association employees meets nirmala sitharaman

ఎక్స్‌ అప్రెంటిస్‌లకు న్యాయం జరిగే వరకు వైయస్సార్‌సీపీ అండగా ఉంటుందని వెల్లడించారు. గత కొద్ది రోజులుగా ఎక్స్‌ అప్రెంటిస్‌ ఉద్యోగులు ధర్నాలు, దీక్షలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన అన్నారు.

కాగా, నావల్‌ డాక్‌ యాజమాన్యం సర్వీస్‌ రూల్స్‌ పాటించడం లేదని నావల్‌ డాక్‌ యార్డ్‌ ఎక్స్‌ అప్రెంటిస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కోటేశ్వరావు అన్నారు. ఎక్స్‌ అప్రెంటిస్‌లను పట్టించుకునే నాథుడే లేరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.

English summary
YSRCP MP Vijaya Sai Reddy and ex apprentices association employees on Thursday met Union Minister Nirmala Sitharaman for justice.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X