తన పాత ప్రొఫెషన్ ను గుర్తు తెచ్చుకున్న సాయిరెడ్డి
Vijayasai Reddy: నేడు ఛార్టర్డ్ అకౌంటెంట్స్ దినోత్సవం. ప్రతి సంవత్సరం జులై 1వ తేదీన ఛార్టర్డ్ అకౌంటెంట్స్ డే గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కామర్స్ కు సంబంధించినంత వరకూ ఇది అత్యుత్తమ హోదాగా చెప్పుకోవచ్చు. అకౌంటింగ్, ఆడిటింగ్, టాక్సేషన్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్‌లో వీరికి ఉన్న నైపుణ్యం అసాధారణం.
వివిధ పరిశ్రమలు, సంస్థల్లో సీఏల పాత్ర కీలకం. ఫైనాన్షియల్ రిపోర్టులను తయారు చేయడం, ఆర్థిక దుర్వినియోగాన్ని పసిగట్టడం- దాన్ని అరికట్టడానికి అవసరమైన సలహాలు, సూచనలను ఇవ్వడం, వాటిని ఆడిట్ చేయడం, పన్ను చెల్లింపుల వంటివి.. వీరి పరిధిలోనే ఉంటాయి.

అలాంటి ప్రాధాన్యత గల రంగంలో ఉన్న ఛార్టర్డ్ అకౌంటెంట్ల కోసం ప్రతి సంవత్సరం జులై 1వ తేదీని సీఏ డే గా జరుపుకొంటారు. దీన్ని పురస్కరించుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. దేశవ్యాప్తంగా ఛార్టర్డ్ అకౌంటెంట్లకు శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ మేరకు దీనికి సంబంధించిన సమాచారాన్ని తన అధికారిక ఎక్స్ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు.
దేశ ఆర్థిక వ్యవస్థలో సీఏలు ప్రధాన పాత్ర పోషిస్తోన్నారని ప్రధాని మోదీ ప్రశంసించారు. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా సేవలను అందించడం వల్ల ఆర్థిక వ్యవస్థ గాడినపడుతుందని పేర్కొన్నారు. దేశంలో అనేక కార్పొరేటర్ సంస్థలు విజయవంతంగా తమ కార్యకలాపాలను కొనసాగింపజేయడంలో సీఏల పాత్ర ఉందని కితాబిచ్చారు.
సీఏల ఖచ్చితత్వం, నైపుణ్యం.. ప్రతి సంస్థకు అత్యవసరమ ని మోదీ అన్నారు. ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థకు ఎంతగానో దోహదం చేస్తోన్నారని ప్రశంసించారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ రంగంలో మరింత మంది అడుగు పెట్టాల్సిన అవసరం ఉందనీ అభిప్రాయపడ్డారు.
రాజ్యసభ మాజీ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి దేశవ్యాప్తంగా చార్టర్డ్ అకౌంటెంట్లకు విషెస్ తెలియజేశారు. తన తోటి చార్టర్డ్ అకౌంటెంట్లందరికీ CA Day శుభాకాంక్షలు అంటూ ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. సీఏలు.. ఆర్థిక వ్యవస్థ మూల స్తంభాల వంటి వాళ్లని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
Wishing all Chartered Accountants a very happy CA Day! Their precision and expertise are essential for every organisation. By emphasising on compliance and transparency, they contribute to a healthy economy. Their role in nurturing successful corporations is also outstanding.
— Narendra Modi (@narendramodi) July 1, 2025
దేశ సమగ్ర ఆర్థిక అభివృద్ధి సాధించడంలో సీఏలు ప్రధాన పాత్ర పోషిస్తోన్నారని అన్నారు. వికసిత్ భారత్ సాధించాలనే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాన్ని నిజం చేద్దామని, దేశ నిర్మాణంలో సీఏల సహకారం ఎంతగానో ఉందని పేర్కొన్నారు.
Wishing all my fellow Chartered Accountants (CA) on #CADay. CAs are an important pillar of the economy. Their multifaceted role is crucial for India’s economic growth, development and our goal of achieving #VikasitBharat. Let’s acknowledge their contribution in nation building.
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 1, 2025
విజయసాయిరెడ్డి రాజకీయాల్లోకి అడుగు పెట్టక ముందు- ప్రొఫెషనల్ ఛార్టర్డ్ అకౌంటెంట్ అనే విషయం తెలిసిందే. వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కంపెనీలకు ఆయన సీఏగా వ్యవహరించారు. ఆ తరువాతే రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications