మహిళల భద్రతపై చంద్రబాబు మాటలు .. దెయ్యాలు వేదాలు వల్లించినట్టే : విజయసాయి ఫైర్
చంద్రబాబు మీద నిత్యం విరుచుకు పడే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తాజాగా మహిళల భద్రతపై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడ్డారు. మహిళల భద్రత గురించి చంద్రబాబుకు మాట్లాడే హక్కు లేదని విజయసాయి సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు . మహిళల భద్రతపై చంద్రబాబు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు.
ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయిరెడ్డి గతంలో చంద్రబాబు హయాంలో మహిళలపై జరిగిన దాడులను గురించి ప్రస్తావించారు.

మహిళల భద్రత గురించి మాట్లాడుతున్న చంద్రబాబు తాసిల్దార్ వనజాక్షిపై చింతమనేని దాడి చేస్తే ఆమెదే తప్పంటూ రౌడీని వెనకేసుకొచ్చిన వారెవరు అంటూ ప్రశ్నించారు. అంతేకాదు బీటెక్ విద్యార్థిని రిషితేశ్వరి ప్రాణాలు తీసిన వారిని కాపాడింది మీరు కాదా ? అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
ఏపీలో తాజాగా మహిళలపై, బాలికలపై దాడులు పెరిగాయి. ప్రేమను నిరాకరించారని ప్రేమోన్మాదుల దాడులు, బాలికలపై అత్యాచారాలు పెరిగిపోతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో పాటు టీడీపీ నేతలు మహిళలకు రక్షణ కల్పించటంలో ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని విమర్శలు గుప్పిస్తున్నారు.
మహిళల రక్షణ కోసం దిశ వంటి చట్టాలు తీసుకువచ్చినా ఈ పరిస్థితిలో మార్పు రావడం లేదని, ఇప్పటివరకు దిశ చట్టం ద్వారా ఏం చేశారు అంటూ ప్రశ్నించిన విషయం తెలిసిందే. మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో చంద్రబాబు హయాంలో మహిళలకు ఏపాటి రక్షించారో చెప్పాలంటూ విజయ సాయి రెడ్డి చంద్రబాబును టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు.
Recommended Video
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications