ప్లాన్ బీ ఉండాలిగా...! రామ్మోహన్ నాయుడికి సాయిరెడ్డి పంచ్..!

ఒకప్పుడు వైసీపీలో నంబర్ టూగా చక్రం తిప్పిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గతేడాది జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి తర్వాత సైలెంట్ అయిపోయారు. చివరికి వైసీపీకి, రాజకీయాలకు గుడ్ బై చెప్పి వ్యవసాయం చేసుకుంటానని వెళ్లిపోయారు. ఆ తర్వాత మధ్యలో మద్యం కేసులో సాక్షిగా హాజరై సిట్ కు వాంగ్మూలం ఇవ్వడం, ఈ కేసులో ఏ1 రాజ్ కెసిరెడ్డిపై ఆరోపణలు చేయడం చేశారు. ఆ తర్వాత ఇదే కేసులో తననూ నిందితుడుగా చేర్చడంతో పూర్తిగా సైలెంట్ అయిపోయారు.

అయితే బహిరంగంగా ఏమీ మాట్లాడుకున్నా సోషల్ మీడియాలో మాత్రం విజయసాయిరెడ్డి యాక్టివ్ గానే ఉంటున్నారు. ఇదే క్రమంలో ఇవాళ సాయిరెడ్డి ఓ ట్వీట్ చేశారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఏర్పడిన సాఫ్ట్ వేర్ సమస్య కారణంగా 300కు పైగా విమానాలు ఇవాళ ఆలస్యం కావడమో, రద్దు కావడమో జరిగింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులపై స్పందిస్తూ సాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఇందులో కేంద్రానికి ఆయన ఓ కీలక సూచన కూడా చేశారు.

Vijayasai Reddy Proposes Plan-B Solution After Major Delhi Flight Delays due to AI glitch

ఢిల్లీ విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ యొక్క ఏఐ వ్యవస్థలలో సాంకేతిక లోపం కారణంగా 100కి పైగా విమానాలు ప్రభావితమైనట్లు సమాచారమని సాయిరెడ్డి తెలిపారు. మన విమానాశ్రయాలు కీలకమైన జాతీయ మౌలిక సదుపాయాలు, లక్షలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోకుండా చూసుకోవడానికి ఇటువంటి లోపాల విషయంలో బలమైన ప్లాన్-బి ఉండాలని ఆయన సూచించారు. ఈ సూచనను ఢిల్లీ ఎయిర్ పోర్టుతో పాటు పౌర విమానయానమంత్రి రామ్మోహన్ నాయుడికీ ఆయన చేశారు.

Vijayasai Reddy Proposes Plan-B Solution After Major Delhi Flight Delays due to AI glitch

మరోవైపు నిన్న సాయంత్రం ఢిల్లీ ఎయిర్ పోర్టులో ప్రారంభమైన ఈ లోపం ఆటో ట్రాక్ సిస్టమ్ కోసం డేటాను అందించే కీలకమైన కమ్యూనికేషన్ నెట్‌వర్క్ అయిన ఆటోమేటిక్ మెసేజ్ స్విచింగ్ సిస్టమ్ పై ప్రభావం చూపిందని తెలుస్తోంది. ఇది కంట్రోలర్‌ల కోసం విమాన ప్రణాళికలను రూపొందిస్తుందని ఎయిర్ పోర్టు వర్గాలు తెలిపాయి. ఆటోమేటిక్ సిస్టమ్ పనిచేయకపోవడంతో, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు అందుబాటులో ఉన్న డేటాను ఉపయోగించి విమాన ప్రణాళికలను మాన్యువల్‌గా సిద్ధం చేయవలసి వచ్చింది. ఇది నెమ్మదిగా, గందరగోళంగా మారింది. ఫలితంగా ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఫ్లైట్ల ఆలస్యం, రద్దీ ఏర్పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+