జగన్ పై ఆమె రెచ్చిపోతుంటే చీమ కుట్టలేదా ? వైసీపీకి సాయిరెడ్డి ప్రశ్న..!
ఒకప్పుడు పార్లమెంట్ లో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత హోదాలో ఉంటూ, ప్రత్యర్దులు వైఎస్ జగన్ పై పల్లెత్తు మాట అన్నా అంతకు పదింతలు కౌంటర్లు వేసిన విజయసాయిరెడ్డి (vijayasai reddy).. ఇప్పుడు తన మాజీ పార్టీ ఎంపీలపై అలాంటి సెటైర్లే వేశారు. గతేడాది ఎంపీ పదవికీ, పార్టీకీ, రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన సాయిరెడ్డి.. మళ్లీ తాజాగా తెరపైకి వచ్చి రాజకీయాల్లో కొనసాగుతానని యూటర్న్ తీసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇవాళ రాజకీయ విమర్శలకు దిగారు.
నిన్న రాజ్యసభలో ఏపీ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ రూపొందించిన విభజన చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ చర్చలో బిల్లుకు మద్దతిచ్చిన కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ఎంపీ రేణుకా చౌదరి మాట్లాడుతూ జగన్ పై తీవ్ర విమర్శలకు దిగారు. అప్పట్లో జగన్ ను అమరావతి అంటావా, కమ్మరావతి అంటావా అని తాను నిలదీసినట్లు తెలుగులో గుర్తుచేసుకున్నారు. అప్పట్లో జగన్ వైఖరిని తాము ఎలా వ్యతిరేకించామో చెప్పుకునేందుకు రేణుక ఈ వ్యాఖ్యలు చేశారు.

సాక్షాత్తు మీ వైసీపీ పార్టీ అధ్యక్షుడి పైన రాజ్యసభలో ఒక కాంగ్రెస్ ఎంపీ ఇలా నోరు పారేసుకుంటుంటే వైసీపీ ఎంపీ లకు చీమకుట్టినట్లైనా అనిపించలేదా? అడ్డుకోరా? ఖండించరా? మౌన ప్రేక్షకులైనారా? https://t.co/zBIoj78cdN@ncbn @tdp @TV9Telugu @NtvTeluguLive @tv5telugu @abntelugutv…
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 3, 2026
అయితే రేణుకా చౌదరి ఈ వాఖ్యలు చేస్తున్నప్పుడు సభలోనే ఉన్న వైసీపీ ఎంపీలు మాత్రం స్పందించలేదు. ఆ తర్వాత బయటికి వచ్చి కూడా రేణుక వ్యాఖ్యల్ని ఖండించలేదు. దీనిపై విజయసాయిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు వైసీపీ ఎంపీల వైఖరిని ప్రశ్నిస్తూ ఓ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన.. సాక్షాత్తు మీ వైసీపీ పార్టీ అధ్యక్షుడి పైన రాజ్యసభలో ఒక కాంగ్రెస్ ఎంపీ ఇలా నోరు పారేసుకుంటుంటే వైసీపీ ఎంపీ లకు చీమకుట్టినట్లైనా అనిపించలేదా? అడ్డుకోరా? ఖండించరా? మౌన ప్రేక్షకులైనారా? అంటూ సాయిరెడ్డి సూటి ప్రశ్నలు సంధించారు. ఈ ట్వీట్ కు రేణుక రాజ్యసభలో మాట్లాడిన వీడియోను సైతం జత చేశారు.












Click it and Unblock the Notifications