రెచ్చిపోతున్న కేంద్రం-టీడీపీ, వైసీపీ చోద్యం.! సాయిరెడ్డి ఫైర్..!

ఏపీలో కొత్త పార్టీ ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy).. అంతకు ముందే అధికార, విపక్షాలైన టీడీపీ, వైఎస్సార్సీపీపై విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా ఈ రెండు పార్టీలను టార్గెట్ చేస్తున్నారు. ఇదే క్రమంలో ఆయన తాజాగా కేంద్రం తీసుకున్న ఓ నిర్ణయంపై ఈ రెండు పార్టీలు మౌనం వహించడాన్ని తప్పుబడుతూ ట్వీట్ చేశారు. ఇందులో టీడీపీ, వైసీపీ అనుసరిస్తున్న విధానాలపై సూటి విమర్శలు చేశారు.

వంగవీటి రాధ ఎంట్రీ వేళ సామినేనికి షాక్- జనసేన ఆఫీసు గేటు వద్దే..!
వంగవీటి రాధ ఎంట్రీ వేళ సామినేనికి షాక్- జనసేన ఆఫీసు గేటు వద్దే..!

విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ భూముల్ని ఈ-వేలం ద్వారా అమ్మేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఈ నెల 30న ఈ-వేలం జరగనుంది. దీనికి భారీ స్పందన కూడా వస్తోంది. ప్రభుత్వం నిర్ణయించిన రేటు కన్నా ఎక్కువకే కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకొస్తున్నారు. అయినా అధికార టీడీపీ కానీ, విపక్ష వైఎస్సార్సీపీ కానీ స్పందించకపోవడంపై విజయసాయిరెడ్డి మంండిపడుతున్నారు. ఈ మేరకు ఇరు పార్టీల తీరును తప్పుబడుతూ సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Vijayasai Reddy Slams YSRCP TDP Silence as Centre Moves to E-Auction Vizag Steel Plant Lands

స్థానిక ఎన్నికలపై సాయిరెడ్డి జోస్యం..! గెలిచేది వారే..! 2029లో మాత్రం..!
స్థానిక ఎన్నికలపై సాయిరెడ్డి జోస్యం..! గెలిచేది వారే..! 2029లో మాత్రం..!

ఇందులో విజయసాయిరెడ్డి... విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అంటూ 1966లో ప్రారంభమైన ఉద్యమానికి ఆరు దశాబ్దాలు గడిచిన తర్వాత, అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆ ఉద్యమ స్ఫూర్తికే చెదలు పట్టించాయని విమర్శలు గుప్పించారు. ఈ రెండు పార్టీలు విశాఖ ఉక్కు కర్మాగార భూములను కేంద్రప్రభుత్వం వేలం వేస్తుంటే చోద్యం చూస్తున్నాయని ఆరోపించారు. రెండు పార్టీల రాజకీయాలు రెండు కుటుంబాల చుట్టూనే తిరుగుతున్నాయి తప్ప, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ప్రజల సెంటిమెంట్లు, రాష్ట్ర భవిష్యత్తుతో ఈ రెండు కుటుంబాలకు ఎలాంటి సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ఇలాంటి సిగ్గూ ఎగ్గూ లేని కుల, మత, స్వార్థ, నాయకుల్ని మనం ఇంకా భరించాల్సిందేనా? అంటూ ప్రజల్ని, ఓటర్లను విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికే ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా తాను కొత్త పార్టీ పెడుతున్నట్లు సాయిరెడ్డి చెప్పుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+