కడప జిల్లాలో ప్లాన్ మార్చిన జగన్, అనూహ్య నిర్ణయం- ఏరి కోరి..!!
స్థానిక సమరానికి నగారా మోగింది. నామినేషన్లకు నాలుగు రోజులే సమయం ఉంది. కూటమి పార్టీ ల మధ్య సీట్లు సర్దుబాటు కొలిక్కి వచ్చింది. కూటమి- వైసీపీకి ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. కడప జిల్లా కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగన్ సొంత జిల్లా కావటంతో రాజకీయంగా దెబ్బ తీసేందుకు టీడీపీ నాయకత్వం కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. దీంతో.. జగన్ కౌంటర్ స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. కీలక నిర్ణయం తీసుకున్నారు.
స్థానిక ఎన్నికల్లో ఎక్కడా వైసీపీకి అవకాశం లేకుండా ఏకపక్షంగా విజయం సాధించాలని కూటమి నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందు కోసం సీట్ల ఖరారు విషయంలో సుదీర్ఘ మంతనాలతో ఎట్టకేలకు సర్దుబాటు చేసుకున్నారు. జనసేన సైతం ఇప్పటి వరకు చెబుతూ వచ్చిన ఫ్రెండ్లీ కంటెస్ట్ నుంచి వెనక్కు తగ్గింది. మూడు పార్టీలు కలిసి వైసీపీకి ఎక్కడా గెలుపు అవకాశం లేకుండా చేయాలని భావిస్తున్నారు. దీంతో.. జగన్ అప్రమత్తం అయ్యారు. పార్టీ నేతలకు స్థానిక ఎన్నికల పైన రెండు నెలలుగా దిశా నిర్దేశం చేస్తున్నారు. జగన్ సొంత జిల్లా కడప పైన టీడీపీ కొత్త వ్యూహాల అమలుకు సిద్దమైంది. కడప కార్పోరేషన్ తో పాటుగా జిల్లాలోని మున్సిపాల్టీల్లో వైసీపీని రాజకీయం గా అష్టదిగ్భంధనం చేసేలా కార్యాచరణ సిద్దం చేస్తోంది. సొంత జిల్లాలో జగన్ ఒక్క సీటు గెలిచే అవకాశం ఇవ్వకూడదని ప్రయత్నాలు కొనసాగిస్తోంది.

నేడు అధికారిక ప్రకటన
దీంతో, జగన్ కడప కార్పోరేషన్ తో సహా పులివెందుల.. జిల్లాలోని మిగిలిన మున్సిపాల్టీల్లో పార్టీ అభ్యర్దుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్దులను ఏరికోరి ఎంపిక చేసారు. టీడీపీ నుంచి ఒత్తిడి వచ్చినా పోటీలో కొనసాగుతారనే నమ్మకం ఉన్న వారిని ఎంపిక చేసారు. అందులో భాగంగా కడప మేయర్ అభ్యర్థిగా మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి సతీమణి బండి దీప్తికి సీటు కేటాయించారు. అదే విధంగా ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోరెడ్డి నరసింహా రెడ్డిని ఎంపిక చేసారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు బరిలోకి దిగనున్నారు. ఇక.. జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందుల చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రమీలమ్మ ను ఎంపిక చేయగా..కమలాపురం చైర్పర్సన్ అభ్యర్థిగా కవితను ఖరారు చేసారు. అటు టీడీపీ సైతం కీలక నేతలను బరిలోకి దించుతోంది. దీంతో... కడప జిల్లా మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు జగన్ సవాల్ గా మారుతున్నాయి. షెడ్యూల్ సైతం ప్రకటించటంతో .. కడపలో ఎన్నికలు.. ఫలితాల పైన రాజకీయంగా ఉత్కంఠ పెరుగుతోంది.












Click it and Unblock the Notifications
