చంద్రబాబు సర్పంచ్ ల సదస్సు అందుకేనా? బాబు సుపారీ మీడియాపైనా సాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలుగుదేశం పార్టీ నేతలపై, టీడీపీ అధినేత చంద్రబాబుపై, లోకేష్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. గురువారం నాడు చంద్రబాబు సర్పంచ్ ల అవగాహన సదస్సు నిర్వహించి, అందులో సర్పంచ్ లకు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వం విధిస్తున్న పన్నులు, గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న తీరుపై సర్పంచుల సమావేశంలో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో చెత్త పన్ను వసూలు చేయబోమని పంచాయతీలు తీర్మానం చేయాలని కూడా చంద్రబాబు సూచించారు. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా చంద్రబాబును టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు.

దొంగే దొంగ అని అరవడం కొత్తకాదు గదా మీకు చంద్రబాబు
చంద్రబాబు గారు సర్పంచ్ ల సదస్సు పెట్టింది ఇందుకా అంటూ ప్రశ్నించిన విజయ సాయి రెడ్డి చంద్రబాబును టార్గెట్ చేశారు. చంద్రబాబు సర్పంచుల సదస్సు పెట్టింది ప్రభుత్వాన్ని ఎలా బ్లాక్ మెయిల్ చేయొచ్చో నేర్పించడానికా? అని మండిపడ్డారు. మీ హయాంలో ఉపాధి హమీ పనుల దోపిడీ వివరాలు కేంద్రం దగ్గర ఉన్నాయి. దొంగే దొంగ అని అరవడం కొత్తకాదు గదా మీకు అంటూ ఎద్దేవా చేశారు. 'నరేగా'లో 7 వేల కోట్ల అవినీతి జరిగితే ఫిర్యాదు చేయకుండా ఎవరు ఆపారు మిమ్మల్ని? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

జగన్ గారి అజాగ్రత్త వల్ల బంగాళాఖాతం వంద కిలోమీటర్లు ముందుకొచ్చిందని ప్రచారం చేసినా చేస్తారు
అంతేకాదు చంద్రబాబుకు మద్దతుగా వార్తలు రాస్తున్న మీడియాపై విజయ సాయి రెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబు సుపారీ మీడియా ఏ స్థాయికి దిగజారిందంటే జగన్ గారి అజాగ్రత్త వల్ల బంగాళాఖాతం వంద కిలోమీటర్లు ముందుకొచ్చిందని ప్రచారం చేసినా చేస్తారు అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. విలువలు, వాస్తవాలతో సంబంధం లేని బతుకులయ్యాయి అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలు విజ్ఞులు అని పేర్కొన్న విజయసాయిరెడ్డి పచ్చ బ్యాచ్ నీచపు కుతంత్రాలను పసిగడుతూనే ఉన్నారు అనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

వైరల్ అవుతున్న అచ్చెన్న వ్యాఖ్యలపై సాయిరెడ్డి సెటైర్లు
అంతకుముందు అచ్చన్న ఉవాచ అంటూ చెక్ లేంటి, ఆస్తి రాసిచ్చినా లాక్కుందాం. వాడిని అలాగే వాడుకుని వదిలేద్దాం అంటూ నియోజకవర్గ స్థాయి నేతనే అన్నాడంటే టీడీపీలో పరిస్థితి ఏంటో అర్ధం చేస్కోవచ్చు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను టార్గెట్ చేశారు. ఇది టీడీపీ పాత సిద్ధాంతమే అయినా అచ్చెన్న కొత్తగా చెప్పాడు. ఇక ఆ పార్టీలో ఉన్న నాయకులకు నా సానుభూతి అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అయ్యన్నపాత్రుడు పై కేసు పెట్టిన నేపథ్యంలో లోకేష్ చేసిన వ్యాఖ్యలను కౌంటర్ చేస్తూ టీడీపీ పని అయిపోయింది అంటూ వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి.

అర్ధం కావడం లేదా లోకేశం నీ పార్టీ పనైపోయిందని
ఇంకా తామున్నామని ఉనికిని చాటుకునేందుకు వైజాగ్ వచ్చిన పప్పు నాయుడుఉత్తరకుమార ప్రగల్బాలు పలుకుతున్నారని మండిపడ్డారు. రోడ్లపై ప్రెస్ మీట్స్ పెట్టి సినిమాడైలాగ్స్ చెప్పినా ఒక్కరూ అటువైపు తిరిగి చూడటంలేదు అని ఎద్దేవా చేశారు. అర్ధం కావడం లేదా లోకేశం నీ పార్టీ పనైపోయిందని అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పరువు నష్టం దావాలు వేయాలంటే నీపై రోజుకు పది పడతాయి అని తేల్చి చెప్పారు విజయసాయిరెడ్డి.












Click it and Unblock the Notifications