ఏరుదాటాక తెప్ప తగలేయడం బాబు మార్క్ పాలిటిక్స్ : చంద్రబాబుపై సాయిరెడ్డి సెటైర్
ఆంధ్రప్రదేశ్ డీజీపీ గా ఉన్న గౌతమ్ సవాంగ్ ను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఆకస్మికంగా బదిలీ చేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టించింది. ఇక గౌతమ్ సవాంగ్ బదిలీని టార్గెట్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు జగన్మోహన్ రెడ్డిపై విమర్శల వర్షం కురిపించాయి. ఇదే సమయంలో ఉన్నతాధికారులకు చురకలంటించారు. టిడిపి నేతలు అయితే బహిరంగ విమర్శలు చేసి జగన్ పై మండిపడ్డారు. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ఏపీపీఎస్సీ చైర్మన్ గా ప్రకటించడంతో ఒక్కసారిగా కంగు తిన్నారు. ఈ క్రమంలోనే తాజాగా వై ఎస్ ఆర్ సి పి ఎంపీ విజయసాయిరెడ్డి మరోమారు చంద్రబాబును టార్గెట్ చేశారు.

డీజీపీలను మార్చే బుద్ధి చంద్రబాబుదే
చంద్రబాబు బుద్ధి డీజీపీలను మార్చే బుద్ధి అంటూ విజయ్ సాయి రెడ్డి మండిపడ్డారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ కు బదిలీ చేయడంలో ఎటువంటి రాజకీయ లేదని ఆయన తేల్చి చెప్పారు. చంద్రబాబు5 ఏళ్ల పాలనలో నలుగురు డీజీపీలను మార్చినా ఒక్కరూ మాట్లాడలేదు అంటూ విజయసాయి రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. జగన్ గారి హయాంలో 30 నెలలు డీజీపీగా చేసిన గౌతమ్ సవాంగును మారిస్తే ఆయనపై ఎదో ప్రేమున్నట్లు పచ్చ బ్యాచ్ గగ్గోలు పెడుతోందని విజయసాయి రెడ్డి మండిపడ్డారు.

ఏరు దాటాక తెప్ప తగలెయ్యటం జగన్ మార్క్ పాలిటిక్స్
సవాంగ్ ను APPSC చైర్మన్ చేయడంతో పచ్చ మీడియాకు షాక్ తగిలినట్టు అయిందని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు. ఏరుదాటాక తెప్ప తగలేయడం బాబు మార్క్ పాలిటిక్స్ కానీ జగన్మోహన్ రెడ్డి కి ఆ అవసరం లేదని విజయ సాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుపై మండిపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి టిడిపి నేతలు విమర్శలు చేసినట్టు అధికారుల బదిలీలతో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని విజయ్ సాయి రెడ్డి పేర్కొన్నారు. ఇక అలాంటి నీచ రాజకీయాలు చేసేది చంద్రబాబు మాత్రమేనని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు.

రాష్ట్రాన్ని చంద్రబాబు ఒక ప్రైవేట్ కంపెనీలా వాడుకున్నారు
అంతకుముందు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అధికారంలో ఉన్నన్నాళ్లు చంద్రబాబు రాష్ట్రాన్ని ఒక ప్రైవేటు కంపెనీలా అందిన కాడికి దోచుకున్నారు అంటూ మండిపడ్డారు. పొత్తులు, అబద్ధపు హామీలతో ఎన్నికల్లో గట్టెక్కుతూ14 ఏళ్లు అధికారం వెలగబెట్టారు అని అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజా సమస్యలపై పోరాడకుండా దుష్ప్రచారాలతో రాక్షసానందం పొందుతున్నారు అంటూ చంద్రబాబు ని టార్గెట్ చేసి విమర్శనాస్త్రాలు సంధించారు.

చంద్రబాబు హయాంలో లక్షల కోట్లపెట్టుబడుల ముచ్చట్లు అన్నీ బాబు చుట్టే తిరిగేవి
అంతేకాదు ఆయనే' ఉంటే దుబాయి ఎక్స్ పో గురించి ఎల్లో మీడియా పేజీలు పేజీలు నింపి జనం మీదికి వదిలేది అంటూ చంద్రబాబు కు అనుకూల మీడియా పై మండిపడ్డారు. లక్షల కోట్లపెట్టుబడుల ముచ్చట్లు అన్నీ బాబు చుట్టే తిరిగేవి అని ఎద్దేవా చేశారు. దుబాయి ప్రిన్స్ విందుకు పిలిస్తే బాబు 'నో' అన్నారన్న అతిశయోక్తులు, కుబేరులు పోటీలుపడి కలిశారన్న కట్టు కథలతో హోరెత్తించేవి అంటూ విజయ సాయి రెడ్డి చంద్రబాబు హయాంలో అన్నీ అతిశయోక్తులు, అబద్ధాలే ఉన్నాయని, వాస్తవాలకు దూరంగా చంద్రబాబు పాలన సాగిందని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications