దురహంకారం తలకెక్కిన చంద్రబాబు అపజయాన్ని ఒప్పుకోలేడు; టీడీపీ ఓటమిని వదిలిపెట్టని సాయి రెడ్డి!!
సందర్భం ఏదైనా సరే తెలుగుదేశం పార్టీపై విరుచుకు పడే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా తాజాగా మరోమారు చంద్రబాబు, నారా లోకేష్ ను టార్గెట్ చేశారు. గత కొంతకాలం పాటు సోషల్ మీడియాలో విమర్శలు తగ్గించిన ఆయన మళ్ళీ ట్విట్టర్ వేదికగా చంద్రబాబు, లోకేష్ పై పదునైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఒక పక్క ఏపీలో వైసీపీ పాలనకు కితాబిస్తూ, జగన్ పాలన పట్ల జనం సంతోషంతో ఉన్నారని చెప్తూ, మరోపక్క టీడీపీని టార్గెట్ చేస్తున్నారు. టీడీపీ పనైపోయిందని పదేపదే తెలుగుదేశం పార్టీ ఉనికిని ప్రశ్నార్ధకం చేస్తున్నారు.

టీడీపీ ఓటమిని వదిలిపెట్టని విజయసాయి రెడ్డి
వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి తాజా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఓటమిని వదిలి పెట్టడం లేదు సోషల్ మీడియా వేదికగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును లోకేష్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. నిన్నటికి నిన్న టిడిపి కుప్పం కోట బద్దలైంది అని చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం మునిసిపాలిటీ లో వైయస్సార్సీపి రికార్డు విజయం సాధించిందని చంద్రబాబును రాష్ట్రమంతటితో పాటుగా ఏళ్లుగా గెలిపిస్తున్న కుప్పం ప్రజలు కూడా నమ్మలేదని దీంతో అర్థమైపోయింది అని విజయ సాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ పతనం మొదలైందని పేర్కొన్న ఆయన, మళ్లీ గురువారం నాడు సోషల్ మీడియా వేదికగా చంద్రబాబును, లోకేష్ ను టార్గెట్ చేశారు.
దురహంకారం తలకెక్కిన చంద్రబాబు .. అపజయాన్ని ఒప్పుకోలేడు
దురహంకారం తలకెక్కిన పలాయన వాది చంద్రబాబు అంటూ పేర్కొన్నారు విజయసాయి రెడ్డి. అంతేకాదు చంద్రబాబు అపజయాన్ని ఒప్పుకోలేడు అంటూ విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఓటమికి ప్రజలదే తప్పు అన్నట్లుగా చంద్రబాబు రెండున్నరేళ్లుగా ప్రజలను నిందిస్తూనే ఉన్నాడని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు. వ్యవస్థలను అడ్డుపెట్టుకొని సంక్షేమ పథకాలను అడ్డుకుంటూ చంద్రబాబు జనానికి పూర్తిగా దూరమయ్యాడు అని, అందుకే ఫలితం అనుభవిస్తున్నాడు అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబు ఎన్నికల్లో ఓటమి పాలు కావడానికి చంద్రబాబు దురహంకారమే కారణమంటూ ధ్వజమెత్తారు.
చంద్రబాబు, లోకేష్ లాంటి తిరస్కృతులు మాత్రం ఎక్కడా కనిపించరు
అంతేకాదు తండ్రీకొడుకులు రాజకీయాల్లో ఉన్న రాష్ట్రాలు దేశంలో చాలా ఉన్నాయని పేర్కొన్న విజయసాయిరెడ్డి గెలిచినా, ఓడినా క్యాడర్ ను కాపాడుకోవడానికి రకరకాల కార్యక్రమాలు చేపట్టడం చూస్తున్నాం అంటూ వెల్లడించారు. అయితే చంద్రబాబు, లోకేష్ లాంటి తిరస్కృతులు మాత్రం ఎక్కడా కనిపించరు అంటూ సెటైర్లు వేశారు విజయసాయిరెడ్డి. కొడుకు ఎమ్మెల్యేగా ఓడితే తండ్రి ప్రతి ఎన్నికల్లో చిత్తవడం పెను విషాదం అంటూ చంద్రబాబును ఎద్దేవా చేశారు.
Recommended Video

కుప్పం ఓటమితో బాబుపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సాయిరెడ్డి
ఇక ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు 2024 లో వైసీపీ విజయానికి చిహ్నం అని పేర్కొన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబు రాజకీయ ప్రస్థానానికి తెర పడిందని, భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా చంద్రబాబు నాయుడు అనర్హుడు అంటూ వ్యాఖ్యానించారు. సొంత నియోజకవర్గంలోనే ఓటమిపాలైన చంద్రబాబుకు దౌర్జన్యాలు, అక్రమాలు అంటూ మాట్లాడే అర్హత లేదని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు. జగన్ సుపరిపాలనను ప్రజలు అర్థం చేసుకున్నారని, మరో ఇరవై ఏళ్ల పాటు జగన్ పరిపాలన సాగిస్తారు అంటూ విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications