అసమర్థ అమెరికా-ఇజ్రాయెల్ ?వీళ్ల వల్ల.. సాయిరెడ్డి సంచలన ట్వీట్..!
ఏపీలో గత వైసీపీ హయాంలో కీలకంగా వ్యవహరించి, ఆ తర్వాత పార్టీ ఓటమి పాలవ్వడంతో రాజకీయాల నుంచి తప్పుకొని దూరంగా ఉంటున్న విజయసాయిరెడ్డి (vijayasai reddy) సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటారు. స్దానిక సమస్యల నుంచి జాతీయ, అంతర్జాతీయ సమస్యల వరకూ అన్నింటినీ టచ్ చేస్తుంటారు. ఆయన పెట్టే ట్వీట్లకు వచ్చే స్పందనతో సంబంధం లేకుండా ఈ యుద్దం సాగుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఆయన ఇరాన్ యుద్దంపై ఫోకస్ పెట్టారు.
ఇరాన్ యుద్దంలో అమెరికా-ఇజ్రాయెల్ అసమర్దను విమర్శిస్తూ విజయసాయిరెడ్డి ఇవాళ ఓ ట్వీట్ పెట్టారు. ఇందులో ఆయన ఇరాన్ యుద్దం 35వ రోజుకు చేరుకుందని, అమెరికా-ఇజ్రాయెల్ బలగాల అసమర్దత కూడా ఇప్పుడు బయటపడటం మొదలైందని తెలిపారు. అలాగే ఇరాన్ పోరాట పటిమని కూడా ప్రశంసించారు. ఈ సుదీర్ధ యుద్దం ప్రభావం అంతర్జాతీయంగా అందరిపైనా పడటం ఖాయమని సాయిరెడ్డి హెచ్చరించారు.

It’s been 35 days since the #IranWar began and the ineffectiveness of US and Israeli forces are starting to show. Iran continues to retain significant capabilities, pointing to a prolonged conflict. A long war risks massive human and economic costs like a global recession. The…
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 5, 2026
"ఇరాన్ యుద్ధం మొదలై 35 రోజులు గడిచాయి, అమెరికా, ఇజ్రాయెల్ బలగాల అసమర్థత ఇప్పుడు బయటపడటం ప్రారంభమైంది. ఇరాన్ ఇప్పటికీ గణనీయమైన సామర్థ్యాలను కలిగి ఉంది, ఇది సుదీర్ఘ సంఘర్షణకు దారితీస్తుందని సూచిస్తోంది. సుదీర్ఘ యుద్ధం ప్రపంచ ఆర్థిక మాంద్యం వంటి భారీ మానవ, ఆర్థిక నష్టాలకు దారితీసే ప్రమాదం ఉంది. ప్రపంచం దౌత్యపరంగా ముందుకు రావాలి, ఈ సంఘర్షణ పరిష్కారం వైపు కాకుండా ఉద్రిక్తతల వైపు పయనిస్తోంది." అంటూ సాయిరెడ్డి ఇవాళ ట్వీట్ లో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications