లోకేష్ కు అచ్చెన్న డప్పు, శవాల దిబ్బలు కనిపించాలని, చంద్రబాబు పసుపు వైరస్ : సాయిరెడ్డి ధ్వజం

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై, నారా లోకేష్ పై, అలాగే టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తండ్రి,కొడుకుల ద్వయం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడిన విజయసాయి రెడ్డి,వార్తల్లో ఉండటం కోసమే ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

లోకేష్ ప్రసన్నం కోసం అచ్చెన్న మరీ దిగజారి డప్పు వాయిస్తున్నాడు

లోకేష్ ప్రసన్నం కోసం అచ్చెన్న మరీ దిగజారి డప్పు వాయిస్తున్నాడు

పసుపు వైరస్ కరోనా వైరస్ లానే ప్రమాదకరమని ఫైర్ అయ్యారు. అంతేకాదు అచ్చెన్నాయుడుపై విరుచుకుపడిన విజయసాయిరెడ్డి లోకేష్ ప్రసన్నం కోసం అచ్చెన్న మరీ దిగజారి డప్పు వాయిస్తున్నాడు. అగౌరవంగా "వాడు సరిగా ఉంటే పార్టీకి ఈ గతి ఎందుకు పడుతుంది"అనడాన్ని చిట్టి నాయుడు సీరియస్ గా తీసుకుంటాడేమోనని టెన్షన్ పడుతున్నట్లు ఉంది. పార్టీ ఉండదు, బొక్కా ఉండదు అని ఉన్నమాటే అన్నావ్..ఆ మాటకే కట్టుబడి ఉండు అచ్చెన్నా అంటూ విజయసాయి రెడ్డి నిప్పులు చెరిగారు.

తిరుపతి ఎన్నికల్లో డబ్బు వెదజల్లితే శిక్షార్హమైన నేరంగా చట్టం

తిరుపతి ఎన్నికల్లో డబ్బు వెదజల్లితే శిక్షార్హమైన నేరంగా చట్టం

తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలలో వైసీపీ విజయంపై టీడీపీకి కౌంటర్ ఇచ్చారు విజయసాయి రెడ్డి. నగదు, మద్యం వంటి ప్రలోభాలు కనిపించని ఎన్నికగా దేశ చరిత్రలోనే విప్లవాత్మక సంస్కరణకు నాంది పలికింది తిరుపతి. ఎన్నికల్లో డబ్బు వెదజల్లితే శిక్షార్హమైన నేరంగా చట్టం తీసుకు వచ్చారు జగన్ గారు. ప్రత్యర్థులపై ప్రయోగించడానికి ఈ చట్టం చేశారన్న బాబు ఇప్పుడు నోరు మెదపడం లేదు అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అంతేకాదు తిరుపతి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి కులంపై అనుమానాలు వ్యక్తం చేశారని పేర్కొన్నారు.

 పరాజయం మూట గట్టుకున్న పార్టీలు ఇప్పుడేమంటాయో?

పరాజయం మూట గట్టుకున్న పార్టీలు ఇప్పుడేమంటాయో?

మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కుట్రలు చేశారని పేర్కొన్న విజయసాయిరెడ్డి, రెండేళ్లు గడిచినా సీఎం జగన్ గారిపై ప్రజల విశ్వాసం పెరిగిందే తప్ప తగ్గలేదు అని గురుమూర్తి మెజారిటీ స్పష్టం చేసిందన్నారు.పరాజయం మూట గట్టుకున్న పార్టీలు ఇప్పుడేమంటాయో అంటూ సెటైర్లు వేశారు విజయసాయిరెడ్డి.రాష్ట్రంలో కరోనా నియంత్రణకు రాష్ట్రప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటుందని,ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలో రాష్ట్ర క్యాబినెట్ సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుందని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి.

ఏపీలో మాత్రం శవాల దిబ్బలు కనిపించాలని వాళ్ల దేవుళ్లకు మొక్కులు

ఏపీలో మాత్రం శవాల దిబ్బలు కనిపించాలని వాళ్ల దేవుళ్లకు మొక్కులు

ఇదే సమయంలో రాష్ట్ర ప్రజలు క్షేమంగా ఉండాలని తండ్రీకొడుకులు ఎన్నడూ కోరుకోరు. జగన్ గారు విఫలమయ్యారని ఏడవడానికి దేశమంతా మహమ్మారి అదుపులోకి వచ్చినా ఏపీలో మాత్రం శవాల దిబ్బలు కనిపించాలని వాళ్ల దేవుళ్లకు మొక్కుతుంటారు. పిశాచాల కంటే క్రూరాతి క్రూరంగా ఉంటాయి వీళ్ళ ఆలోచనలు అంటూ విజయసాయి రెడ్డి చంద్రబాబు, లోకేష్ లపై మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+