వీధీరౌడీల్లా: రాములమ్మ, చీకటి పనులు చేయం:శ్రీకాంత్

చీకటి పనులు అలవాటు లేదు: శ్రీకాంత్ రెడ్డి
తమకు చీకటి పనులు చేసే అలవాటు లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యులు శ్రీకాంత్ రెడ్డి శుక్రవారం అన్నారు. సీమాంధ్ర టిడిపి నేత పయ్యావుల కేశవ్ అంతకుముందు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన నిప్పులు చెరిగారు. దీనిపై శ్రీకాంత్ రెడ్డి స్పందించారు.
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి అమ్ముడుపోయి టిడిపి తమపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. టిడిపి పేరు బదులు వన్ బై టు అని పెట్టుకుంటే మంచిదన్నారు. టిడిపితో పొత్తు అంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు సైతం భయపడుతున్నారన్నారు.
తమకు టిడిపిలా చీకటి పనులు చేసే అలవాటు లేదన్నారు. పయ్యావులకు దమ్ముంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కాలర్ పట్టుకొని సమైక్యం కోసం లేఖ రాయించాలన్నారు. టిడిపి సమైక్యమో, విభజననో చెప్పలేని పరిస్థితిలో ఉందన్నారు. ఆ పార్టీకి ఓ విధానమంటూ లేదన్నారు.












Click it and Unblock the Notifications