ప్రియుడి కోసం ఏకంగా పది కిలోల బంగారం కొట్టేసిన బ్యాంక్ మేనేజర్..
ప్రేమ కోసం షాజహాన్ లాంటి ప్రేమికుడు తాజ్‌మహాల్‌ను నిర్మించాడు. ఇంకా చాలామంది ప్రేమ కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ప్రస్తుత సమాజంలో కూడా ఇలాంటివి చాలానే చూస్తున్నాం. అయితే ఇక్కడ మాత్రం ఓ ప్రియురాలు తన ప్రియుడి కోసం ఏకంగా దొంగగా మారిపోయింది. తను పని చేస్తున్న ఆఫీసులోనే దొంగతనానికి పాల్పడింది. ప్రియుడి కోసం ఏకంగా పది కిలోల బంగారాన్ని కొట్టేసింది. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలైంది. దొంగగా మారిన ఆ ప్రియురాలి కథేంటో తెలుసుకుందాం పదండి..
ఆరు కోట్ల రూపాయలు విలువైన బంగారం: విజయవాడ కంకిపాడులోని మణపురంలో బ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తుంది పావని. ఈ మహిళ ప్రియుడి కోసం ఏకంగా పది కిలోల బంగారాన్నే కొట్టేసింది. ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ పదికిలోల బంగారం విలువ అక్షరాల ఆరు కోట్ల రూపాయలు. గౌరవప్రదమైన ఉద్యోగంలో ఉంటూ ఇంతటి దారుణానికి ఒడిగట్టింది. గుడివాడ రూరల్‌లోని లింగవరం గ్రామానికి చెందినది పావనికి ఇంతకుముందే పెళ్లి అయ్యింది. చక్కగా ఉద్యోగం చేసుకుంటూ భర్తతో, పిల్లలతో సంతోషంగా ఉండాల్సిన ఆ మహిళ ఈ దారుణానికి పాల్పడింది.

ప్రియుడి మోజులో పడి భర్తను వదిలేసింది. వేరు కాపురం పెట్టింది. కంకిపాడు మణ్ణపురం బ్రాంచ్‌కి బదిలీ చేయించుకొని ప్రస్తుతం బ్రాంచ్ మేనేజర్ గా అక్కడ విధులు నిర్వర్తిస్తుంది. ఆ సమయంలోనే అక్కడ ఒక యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అయితే, ఆ యువకుడు గతంలో ఓ స్కూల్‌ను నడిపి అప్పులపాలయ్యాడనే విషయం తెలుసుకుంది. దీంతో ఆ యువకుడు పావనితో కలిసి ఓ ప్రణాళిక వేశాడు. పావనీ పనిచేస్తున్న ఆఫీసులో ఉన్న బంగారాన్ని కొట్టేయాలనుకున్నారు. అనుకున్నదే తడువుగా అక్టోబర్ 16న బ్రాంచ్‌కి సిబ్బంది కంటే ముందే వెళ్లింది ఆ మహిళ లాకర్ లో ఉండే పది కిలోల బంగారాన్ని బ్యాగ్‌లో సర్దుకుని ఎమీ తెలియనట్లు బయటికొచ్చింది.
తన దగ్గరే నాలుగు కిలోల బంగారం: అయితే, బ్యాంక్ సిబ్బంది అంతా ఆమె లీవ్‌లో ఉన్నారేమో అనుకున్నారు. ఫోన్‌చేయగా, స్విచ్ఛాఫ్ అని వస్తుంది. ఆ తర్వాత లాకర్‌దగ్గరికి వెళ్లి చూడగా, బంగారం కనిపించలేదు. దాంతో బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పది కిలోల బంగారంతో పారిపోయిన పావని ఆరు కిలోలు ప్రియుడికిచ్చి, మిగతా నాలుగుకిలోలు తన దగ్గర భద్రంగా తెచ్చకుంది. వెంటనే, ఇంటి దగ్గరినుంచి బంధువులతో కలిసి షిరిడి వెళ్లింది.
పావని బ్యాగ్ తీసుకుని వెళ్లడం సీసీ కెమెరాలో రికార్డయ్యింది. షిరిడి నుండి లవర్‌తో ఫోన్ మాట్లాడినట్లు తెలుసుకున్న పోలీసులు ఆ లేడీని పట్టుకొని కంకిపాడు పీఎస్ కి తరలించారు. ఎస్పీ జాషువా ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టునున్నట్లు తెలిపారు. బంగారం కొట్టేయడంలో పావనికి తోడుగా వున్నయువకుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది..












Click it and Unblock the Notifications