సాయిబాబా ఆలయానికి లక్షల విరాళం.. విజయవాడలో యాచకుడి దాతృత్వం!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఒక యాచకుడు సాయిబాబా ఆలయ అభివృద్ధి కోసం అందిస్తున్న విరాళాల వ్యవహారం ఆసక్తికరంగా మారింది . తాజాగా విజయవాడ సాయిబాబా మందిర అభివృద్ధికి ఓ యాచకుడు లక్ష రూపాయల విరాళం అందించారు . ఇప్పటివరకు ఆ యాచకుడు ఆలయానికి అందించిన విరాళం అక్షరాల 9 లక్షల 54 వేల రూపాయలు.
ఇక ఈ కథనం వివరాల్లోకి వెళితే ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ముత్యాలంపాడు లోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరం వద్ద యాదిరెడ్డి అనే ఒక యాచకుడు భిక్షాటన చేసి జీవనం సాగిస్తున్నాడు. భక్తుల నుంచి తాను సేకరించిన డబ్బులతో ఆలయాల అభివృద్ధికి విరాళాలు అందజేస్తున్నాడు.

తాజాగా భక్తుల నుంచి సేకరించిన సొమ్ముతో లక్ష రూపాయలు జమ చేసి ముత్యాలంపాడు లోని షిరిడి సాయిబాబా మందిర అభివృద్ధికి అందించారు. ఈ డబ్బును ఆలయ గౌరవాధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డికి యాచకుడు అందజేశాడు. అయితే ఇది ఆలయానికి మొదటిసారిగా యాచకుడు ఇచ్చిన విరాళం కాదు.
ప్రస్తుతమిచ్చిన డబ్బులే కాకుండా వివిధ సందర్భాలలో 8 లక్షల 54 వేల 691 రూపాయలు విరాళంగా అందజేశారని సాయిబాబా మందిర గౌరవాధ్యక్షుడు గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఇక తాను సాయిబాబా మందిరానికి విరాళం ఇవ్వడం పైన మాట్లాడిన యాదిరెడ్డి బాబా మందిరం వద్ద తన భిక్షాటన ద్వారా సంపాదించిన డబ్బు తిరిగి బాబాకే ఇవ్వడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు.
ఇకపై తాను సంపాదించే ప్రతి రూపాయి కూడా దైవకార్యాలకు ఉపయోగిస్తానని ఆయన చెబుతున్నారు . ఆలయ అభివృద్ధికి యాచించిన డబ్బును విరాళంగా ఇచ్చిన యాచకుడు యాదిరెడ్డిని ఆలయ గౌరవ అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి బాబా వారి శేష వస్త్రంతో సత్కరించారు.వేల కట్ల రూపాయలు ఉన్నా దైవ కార్యాలకు డబ్బు ఖర్చుపెట్టని వారు ఎంతో మంది ఉన్నారు. కానీ యాచన చేసిన డబ్బును దైవ కార్యానికి ఖర్చు పెడుతున్న యాచకుడు గ్రేట్ అంటున్నారు ఈ విషయం తెలిసిన వాళ్ళు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications