దేవుడా! ఒక్కసారి బతికించు: బోటు ప్రమాదం చివరి నిమిషంలో, సీపీఐ నారాయణ సోదరి మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu
  Krishna River Boat Mishap : బోటు ప్రమాదానికి కారణాలివీ!

  విజయవాడ: విజయవాడ ఫెర్రీ ఘాట్ ప్రమాదంలో మృతుల సంఖ్య సోమవారం ఉదయం నాటికి 18కు చేరుకుంది. బాధితులు ఆదివారం పలు ప్రదేశాలను సందర్శించిన అనంతరం విజయవాడలోని పున్నమిఘాట్‌కు సాయంత్రం చేరుకున్నారు. అక్కడి నుంచి పడవలో పవిత్రసంగమం వద్ద నిత్యహారతిని తిలకించేందుకు వెళ్లాలనుకున్నారు.

  అప్పటికే సాయంత్రం నాలుగున్నర కావడం, రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆంధ్రప్రదేశ్ టూరిజం బోటుకు రాదని సిబ్బంది చెప్పారు. అక్కడే ఉన్న ప్రయివేటు సంస్థ రివర్‌ బోటింగ్‌ అండ్‌ అడ్వంచర్స్‌కు చెందిన బోటును మాట్లాడుకున్నారు.

   కృష్ణా నదిలో తిరిగేందుకు అనుమతి లేదు

  కృష్ణా నదిలో తిరిగేందుకు అనుమతి లేదు

  ఈ పడవకు కృష్ణా నదిలో తిరిగేందుకు అనుమతే లేదు. దానిలో 20 మందిని కూడా ఎక్కించడానికి వీలులేకపోయినా. ఏకంగా 38 మందిని ఎక్కించారు. సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో పున్నమిఘాట్‌ నుంచి పవిత్ర సంగమం వద్దకు అది బయలుదేరింది. సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో పవిత్ర సంగమం సమీపానికి చేరుకుంది. అక్కడ సరిగ్గా గోదావరి జలాలు కృష్ణా నదిలో కలిసే ప్రాంతంలోకి పడవ చేరుకోగానే ఒక్కసారిగా కుదుపులు వచ్చాయి.

   అక్కడ ఇసుక మేటలు

  అక్కడ ఇసుక మేటలు

  అది దాటి కొంచెం ముందుకు వెళ్లగానే నదిలో ఇసుక మేటలు ఉన్నాయి. పడవ ఓ వైపునకు కొంచెం ఒరిగింది. అందులో ఉన్న భయంతో మరోవైపుకు వచ్చారు. ఇదే సమయంలో డ్రైవర్‌ పడవను ఒక్కసారిగా పక్కకు తిప్పడంతో అది బోల్తా పడింది. ఈత వచ్చిన కొందరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. మరికొందరు పడవను పట్టుకుని వేలాడుతూ ఉండిపోయారు. వెంటనే మత్స్యకారులు స్పందించారు. ఆ తర్వాత నిత్యం కృష్ణా నదిలో సహాయక చర్యల కోసం ఉండే ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అక్కడకు చేరుకుని కొందరిని రక్షించాయి.

   దేవుడా ఒక్కసారి బతికించు

  దేవుడా ఒక్కసారి బతికించు

  పడవ ప్రమాదం సమయంలో అందులో బతికి బయటపడ్డ వారు ఆ క్షణాలను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఆ సమయంలో దేవుడా.. ఒక్కసారి బతికించు అని తాము ప్రార్థించామని, ఆ సమయంలో తమ ముందు జీవితం కదలాడిందని, పిల్లలు, బంధువులు, స్నేహితులు గుర్తుకు వచ్చారని చెబుతున్నారు. బతకడానికి ఒక్క అవకాశం ఇవ్వండని దేవుడిని వేడుకున్నామని కన్నీరుమున్నీరు అవుతున్నారు.

   ఓ బాధితురాలి కన్నీటి వ్యథ

  ఓ బాధితురాలి కన్నీటి వ్యథ

  ప్రమాదం జరిగిన బోటులో ఒంగోలుకు చెందిన ప్రభాకర్ రెడ్డి, శ్రీలక్ష్మి దంపతులు ఉన్నారు. ప్రభాకర్ ఘటన స్థలంలోనే మృతి చెందగా, శ్రీలక్ష్మి ప్రాణాలతో బతికిబయటపడ్డారు. భర్త మృతదేహాన్ని తీసుకొచ్చి పవిత్ర సంగమం ప్రాంతంలో ఉండగానే దాని పక్కన శ్రీలక్ష్మి కూర్చొని.. భర్త గుండెలపై నొక్కుతు లేపాలని చూడటం అందరినీ కంటకడి పెట్టించింది.

  గల్లంతైన వారిలో సీపీఐ నారాయణ బంధువులు

  గల్లంతైన వారిలో సీపీఐ నారాయణ బంధువులు

  బోటు ప్రమాదంలో సీపీఐ నారాయణ సోదరి లలితమ్మ మృతి చెందారు. లలితమ్మ కోడలు హరిత, మనవరాలు హర్షితలు గల్లంతయ్యారు. విషయం తెలిసి నారాయణ, ఆయన భార్య, బంధువులు అక్కడకు చేరుకున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  A boat overloaded with tourists capsized in the Krishna River in Andhra Pradesh on Sunday evening, resulting in the death of 18 people.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి