Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అంటార్కిటికాలో భారీ భూకంపం

అంటార్కిటికా ఖండాన్ని భారీ భూకంపం కుదిపేసింది. అక్కడి ఓ చిరు ద్వీపంలో సంభవించిన ఈ భూప్రకోపానికి తీర ప్రాంతం మొత్తం అల్లకల్లోలానికి గురైంది. అలలు ఎగిసిపడ్డాయి. పెద్దగా జనావాస ప్రాంతం కాకపోవడం వల్ల ప్రాణనష్టం సంభవించినట్లు ఇప్పటివరకు ఎటువంటి వార్తలు అందలేదు. భూకంప తీవ్రత అధికంగా ఉండటం వల్ల సునామీ విరుచుకుపడే ప్రమాదం ఉన్నట్లు తొలుత భావించారు గానీ ఆ సూచనలేవీ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

అంటార్కిటికాలోని సౌత్ షెట్లాండ్ దీవుల్లో ఈ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.7గా నమోదైంది. ఉపరితలం నుండి సుమారు 10 కిలోమీటర్ల (సుమారు 6.21 మైళ్లు) లోతులో టెక్టానిక్ ప్లేట్లల్లో చోటు చేసుకున్న భారీ కదలికల వల్ల ఈ ప్రకంపనలు నమోదయ్యాయి. దీని తీవ్రత, అలాగే ఆ ప్రాంతం భూకంపాలకు గురయ్యే అవకాశం ఉండటం వల్ల ఈ ప్రభావం గణనీయంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Earthquake today South Shetland Islands in Antarctica Jolts by 6 7 Magnitude Quake GFZ Reports

అర్జెంటీనా కాలమానం ప్రకారం ఈ తెల్లవారు జామున 5:52 నిమిషాలకు భూమి ప్రకంపించినట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) తెలిపింది. 6.5కు పైగా తీవ్రతతో సంభవించిన భూకంపం కావడం వల్ల సునామీ సంభవించే ప్రమాదం లేకపోలేదని పేర్కొంది. సౌత్ అట్లాంటిక్, గల్ఫ్, పసిఫిక్ మహా సముద్రం తీరంపై దీని ప్రభావం ఉండొచ్చని తొలుత అంచనా వేసింది. ఆ తర్వాత దీని తీవ్రత స్థాయిని తగ్గిస్తూ సునామీ రిస్క్ వార్నింగ్ జారీ చేసింది.

ఇది షాలో ఎర్త్ క్వెక్. అంటే భూఉపరితలానికి అతి సమీపంలో చోటు చేసుకుంది. ప్రకంపనలు అతివేగంగా ఉపరితలాన్ని తాకుతాయి. సాధారణ భూకంపం కంటే అతి తీవ్రమైన ప్రమాదాన్ని కలుగజేస్తాయి. సౌత్ షెట్లాండ్ దీవుల్లో జనసంచారం నామమాత్రం. ఇక్కడ పెంగ్విన్ పాపులేషన్ అధికంగా ఉంటుంది. చిలీ, అర్జెంటీనాకు సమీపంలో ఉంటుందీ సౌత్ షెట్లాండ్ ఐలండ్. అతి సమీప ప్రాంతం అర్జెంటీనాలోని టియెర్రా డెల్ ఫ్యూగో ప్రావిన్స్ లోని ఉషుయాయి టౌన్. ఇక్కడి నుండి సౌత్ షెట్లాండ్ 998 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+