రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!!
తెలంగాణ ప్రభుత్వం పండుగ వేళ గుడ్ న్యూస్ చెబుతోంది. 2026-27 వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీ లో ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది. ఈ సారి బడ్జెట్ లో పెండింగ్ హామీల అమలు దిశగా ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా పెన్షన్ పెంపు ఒకే సారి కాకుండా దశల వారీగా పెంచేందుకు నిర్ణయించారు. దీంతో పాటుగా కల్యాణ లక్ష్మీ/ షాదీ ముబాకర్ మొత్తాన్ని పెంచనున్నారు. సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూనే.. మౌలిక వసతుల కల్పన దిశగా బడ్జెట్ కేటాయింపులు ఉండే అవకాశం కనిపిస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం 2026-27 బడ్జెట్ ప్రతిపాదనల పైన తుది కసరత్తు చేస్తోంది. ఈ సారి బడ్జెట్ ప్రతిపాదనల్లో వ్యసాయం, సంక్షేమ రంగాలకు బడ్జెట్‌లో పెద్ద పీట వేయనుంది. రైతు భరోసా, సన్నాలకు రూ.500 చొప్పున బోనస్, రైతు బీమా, ఆయిల్‌పామ్ సాగు వంటి పథకాలకు నిధులు కేటాయించనుంది. యంగ్ ఇండియా సమీకృత గురుకుల విద్యాలయాలకు ప్రాధాన్యత దక్కనుంది.

కాగా.. పెండింగ్ లో ఉన్న ఎన్నికల హామల అమలు దిశగానూ బడ్జెట్ లో కేటాయింపు లు ఉంటాయని తెలుస్తోంది. అందులో భాగంగా కల్యాణలక్ష్మి/ షాదీ ముబారక్ పథకం కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని ఈసారి పెంచే ఆలోచన చేస్తున్నారు. ఈ మేరకు ప్రస్తుతం రూ.1,00,116 అందిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సాయానికి మరో రూ.50 వేలు పెంచి రూ.1,50,116 చొప్పున అందించే విధంగా బడ్జెట్ కేటాయింపులు చేయనున్నట్లు తెలుస్తోంది.
బడ్జెట్ ప్రతిపాదనల పై తుది కసరత్తు
అదే విధంగా చేయూత పింఛన్లను కూడా పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు. పెన్షన్లు పెంచుతామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు. ప్రస్తుతం రూ.2,016 చొప్పున పింఛను అందిస్తోంది. 500 పెంచి, రూ.2,516 చొప్పున ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాలేజీ విద్యార్థినులకు ఈ-స్కూటీలను అందజేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈసారి బడ్జెట్‌లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. దీని కింద రూ.1600 కోట్లు కేటాయింపు లు చేయాల్సిన అవసరం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
దీంతో.. ఈ సారి బడ్జెట్ లో మొత్తం గా రూ.3.20 లక్షల కోట్లకు కాస్త అటూ ఇటుగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది.2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.3,04,965 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. దానికి మరో 5 శాతం పెంచి 2026-27 బడ్జెట్‌ను ప్రవేశపెడుతుందని సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రాబడులకు అనుగుణంగా ప్రభుత్వం వ్యయాలు చేస్తూ వస్తోంది. ద్రవ్య లోటును బహిరంగ మార్కెట్ రుణాల ద్వారా పూడ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
-
Lockdown: ఇవాళ రాత్రి నుంచే కర్ఫ్యూ, ప్రభుత్వం సంచలన నిర్ణయం! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' మూవీ ఫస్ట్ రివ్యూ: హిట్టు కొట్టి కొట్టి బోర్ కొట్టట్లేదా అన్నా..!! -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
జగన్ సెగ ఎక్కడ తాకాలో అక్కడ తాకింది.. -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు -
బంగారం ధరల్లో బిగ్ డౌన్ ఫాల్.. !!












Click it and Unblock the Notifications