ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. దీనిపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉగాది పండగను పురస్కరించుకుని ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందీ మూవీ. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లు. మైత్రీ మూవీస్ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ సినిమాను నిర్మించారు. అశుతోష్ రాణా, నవాబ్ షా, అవినాష్, గౌతమి కీలక పాత్రల్లో నటించారు.
ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా తాజాగా ప్రీ-రిలీజ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ను ఏర్పాటు చేసింది చిత్రం యూనిట్. దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత్ నవీన్ యెర్నేని, హీరోయిన్లు రాశీఖన్నా, శ్రీలీల ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా శ్రీలీల- మహేష్ ఆచంటకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. తన వెనుక నిల్చున్న మహేష్ అచంట వైపు శ్రీలీల కోపంగా చూసినట్లు కనిపించడం అభిమానులను గందరగోళానికి గురిచేసింది. తొలుత శ్రీలీల తన వెనుక నిల్చున్న మహేష్ వైపు తిరగడం, సీరియస్ లుక్ ఇవ్వడం ఈ వీడియోలో స్పష్టంగా రికార్డయింది. మొదట మహేష్ చిరు నవ్వు నవ్వినా, శ్రీలీల సీరియస్ గా చూడటంతో మౌనంగా మారిపోవడం ఇందులో చూడొచ్చు.
మహేష్ రియాక్షన్ చూశాక.. ఏదో తేడా జరిగిందని అభిమానులు భావించారు. దీనిపై తొలుత మహేష్ ఆచంట స్పందించాడు. ఈ గందరగోళానికి తెరదించాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ క్లిప్‌కు వివరణ ఇచ్చాడు. శ్రీలీల ఫోన్ తన దగ్గర ఉండిపోయిందని, ఆమె వెనక్కి తిరిగి చూసినప్పుడు ఫోన్ గురించి అడుగుతోందని అనుకున్నానని అన్నాడు. నిజానికి ఆమె వెనుక ఉన్న స్క్రీన్‌ను చూస్తోందని, అంతే తప్ప సీరియస్ గా తీసుకోవాల్సిన సంఘటన ఏదీ జరగలేదని, ఆమె ఎవరినీ అగౌరవపరచలేదని అన్నాడు.
ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రీరిలీజ్ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా శ్రీలీల కూడా క్లారిటీ ఇచ్చారు. పవన్ కల్యాణ్ స్పీచ్ వింటోన్న సమయంలో వెనుక నుండి ఓ సౌండ్ వినిపించింది. వెనక్కి తిరిగాను. ఆయన (మహేష్ ఆచంట) వద్ద నా ఫోన్ ఉంది. ఆ ఫోన్ కోసం తిరిగానని ఆయన, ఏదో వినిపించిందని నేను వెనక్కి తిరిగి చూశాను. అంతే తప్ప అక్కడ ఏమీ జరగలేదు.. అని శ్రీలీల చెప్పారు.
ఇండస్ట్రీ అన్నప్పుడు ఇటువంటి క్లిప్పింగ్స్, ప్రచారాలు జరుగుతుంటాయని, అవన్నీ మిస్ కమ్యూనికేషన్సేనని అన్నారు. ఎవరైనా వర్బల్ గా చెప్పేంత వరకూ ఏదీ నమ్మొద్దని కోరారు. మిస్ బిహేవియర్, యారోగెన్స్ అనడంలో అర్థం లేదని క్లారిటీ ఇచ్చారు. తాము ఏదైనా స్వయంగా చెబితేనే నమ్మాలని అన్నారు.
-
‘బాహుబలి2’ను దాటలేకపోయిన ‘ధురంధర్2’ -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
పాన్ ఇండియా సినిమాలో బోల్డ్ సీన్.. చేయనని మొండికేస్తున్న స్టార్ హీరోయిన్! -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
NTRNeel: వాడి బాడీ బాక్సాఫీస్ రా: `హెర్కులెస్`.. !! -
యాంకర్ విష్ణుప్రియకి బిగ్ షాక్.. క్రిమినల్ కేసు?? -
తప్పు తప్పు.. అంతకు ముందు అలా చేయలేదా ?? అనసూయ పోస్ట్ వైరల్ !! -
నమ్మినోడే.. ముంచేశాడుగా.. టాలీవుడ్ బడా నిర్మాతకు వెన్నుపోటు !! -
"ఆశా బోస్లే"కు భర్త బర్మన్ పెళ్లికి ముందే ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఏంటో తెలుసా ??? -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications