ఉస్తాద్ కోసం పవన్ రెమ్యునరేషన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. దీనిపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉగాది పండగను పురస్కరించుకుని ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందీ మూవీ. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లు. మైత్రీ మూవీస్ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ సినిమాను నిర్మించారు. అశుతోష్ రాణా, నవాబ్ షా, అవినాష్, గౌతమి కీలక పాత్రల్లో నటించారు.
సినిమా టిక్కెట్ ధరల పెంపుపై కొద్ది రోజులుగా విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అభిమానులకు శుభవార్త అందింది. నైజాం ప్రాంతంలో టికెట్ రేట్లు పెంచకూడదని మైత్రీ మూవీస్ మేకర్స్ నిర్ణయించింది. ఎప్పట్లాగే సాధారణ టిక్కెట్ ధరలకే ప్రేక్షకుల ముందుకు తీసుకుని రాబోతోంది. మామూలు టికెట్ రేట్లకే ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల కానుంది. ఈ నిర్ణయం తెలంగాణలో పవన్ కళ్యాణ్ అభిమానులను ఆనందంలో నింపింది.

కాగా- ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా తాజాగా ప్రీ-రిలీజ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ను ఏర్పాటు చేసింది చిత్రం యూనిట్. దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత్ నవీన్ యెర్నేని, హీరోయిన్లు రాశీఖన్నా, శ్రీలీల ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కమర్షియల్ ప్లస్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ గా వచ్చిన మన శంకరవరప్రసాద్ గారు కాకుండా ఓ ఫుల్ లెంగ్త్ బిగ్ స్టార్ ఫుల్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమా వచ్చి చాలా రోజులైందని, ఆ లోటును ఉస్తాద్ భర్తీ చేస్తుందని హరీష్ శంకర్ చెప్పారు. సినిమా నిడివి రెండున్నర గంటలలోపే ఉంటుందని, ప్రతి ఫ్రేమ్ కూడా విజిల్స్ వేయించేలా ఉంటుందని అన్నారు. థియేటర్లకు రిపీట్ ఆడియన్స్ వచ్చేలా చిత్రాన్ని రూపొందించామని చెప్పారు.
లాస్ట్ మినిట్‌లో థమన్ హీరోలా ఎంటర్ అయ్యాడని, ఆయనకు మనస్పూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నానని హరీష్ శంకర్ అన్నారు. ఒక పెద్ద కమర్షియల్ సినిమాకు 12 రోజుల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చేయడం మామూలు విషయం కాదని, కష్ట సమయంలో థమన్ తోడుగా నిలిచాడని అన్నారు. మా బావ (థమన్) ను జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని అన్నారు.
అనంతరం నవీన్ యెర్నేని మాట్లాడారు. సినిమా చేద్దామనుకున్నప్పుడు పవన్ కల్యాణ్ నామమాత్రంగా అడ్వాన్స్ తీసుకున్నారని, అప్పటి నుండి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ గా తీసుకోలేదని అన్నారు. సినిమా డిలే కావడం వల్ల నిర్మాత కంఫర్టబుల్ గా ఉండాలనే ఉద్దేశంతో తమను ప్రోత్సహించారని చెప్పారు. మూడు నెలల్లో సినిమా కంప్లీట్ చేస్తానని షూటింగ్ మొదటి రోజే చెప్పారని, దానికి అనుగుణంగా కష్టపడ్డారని అననారు.
రాజకీయాల్లో కొనసాగుతున్నప్పటికీ పవన్ ప్రతి రోజూ షూటింగ్ కు వచ్చేవాడని, 12 నుండి 15 గంటల పాటు కష్టపడ్డాడని అన్నారు. సినిమా కోసం తనను తాను ట్రాన్స్ ఫామ్ అయ్యారని, ప్రేక్షకులు పవన్ కల్యాణ్ ను ఎలా చూడాలని కోరుకుంటారో అలాంటి లుక్ తో కనిపించారని, ఈ మధ్యకాలంలో ది బెస్ట్ అనిపించేలా ఆయన ఉంటాడని గ్యారంటీ ఇస్తున్నానని నవీన్ యెర్నేని పేర్కొన్నారు.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
తెలుగులో 100 రోజులు ఆడిన సినిమాల్లో ఈ హీరోదే రికార్డు -
ఆ హీరోతో నటించాలని ఉంది.. కానీ అలా మాత్రం కాదు !! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..! -
స్టార్ హీరోలున్నా.. కేవలం ఈ విలన్లవల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు












Click it and Unblock the Notifications