Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు

ఇరాన్ యుద్ధం నేపథ్యంలో హార్ముజ్ జలసంధి గుండా సురక్షిత రవాణా ప్రయత్నాలకు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్ సిద్ధంగా ఉన్నామని ప్రకటించాయి. ఈ మేరకు ఓ జాయింట్ స్టేట్ మెంట్ విడుదల చేశాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంధన వ్యవస్థను స్థిరీకరించడంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటామని వెల్లడించాయి. ఈ విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ తో కలిసి పని చేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేశాయి.

గల్ఫ్‌లో వివిధ దేశాల కార్గో సిప్ లపై ఇరాన్ దాడులు చేయడాన్ని ఆయా దేశాలు తప్పుపట్టాయి. నిరాయుధ వాణిజ్య నౌకలపై దాడులు చేయడం సరికాదని తేల్చి చెప్పాయి. చమురు, గ్యాస్ ప్లాంట్లు, వీటికి సంబంధించిన ఇతర పౌర మౌలిక వసతులపై జరిగిన దాడులను తాము తేలిగ్గా తీసుకోవట్లేదని, హార్ముజ్ జలసంధిని మూసివేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ స్టేట్ మెంట్ స్పష్టం చేసింది. ఉధృతమౌతున్న సంఘర్షణ పట్ల ఆందోళన వ్యక్తం చేసింది.

Broad Coalition Signals Readiness to Stabilise Energy Markets and Protect Strait of Hormuz Routes

డ్రోన్, క్షిపణి దాడులు, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ లో మైన్లు అమర్చడం, వాణిజ్య రవాణాకు అడ్డంకులను తక్షణమే ఆపాలని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్ డిమాండ్ చేశాయి. నౌకాయాన స్వేచ్ఛ అనేది ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టాల సమ్మిట్ పరిధిలోకి వస్తుందని, వీటిని అడ్డుకోవడం ద్వారా అంతర్జాతీయ చట్ట ప్రాథమిక సూత్రాలను ఇరాన్ ఉల్లంఘించిందని ఆరోపించాయి. ఇరాన్ చర్యల ప్రభావం ప్రపంచంలోని అన్ని ప్రాంతాల ప్రజలపై, ముఖ్యంగా అత్యంత బలహీన వర్గాలపై పడుతుందని పేర్కొన్నాయి.

హార్ముజ్ స్ట్రెయిట్ గుండా సురక్షిత ప్రయాణానికి తగిన ప్రయత్నాలకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని, ఇందుకు సహకరించే ఇతర దేశాలను కూడా ఆహ్వానిస్తున్నామని తెలిపాయి. అలాగే వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను సమన్వయబద్ధంగా విడుదల చేయడానికి అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ (IEA) నిర్ణయాన్ని కూడా స్వాగతిస్తున్నామని పేర్కొన్నాయి. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి యూరోపియన్ గ్యాస్ ధరలు 60 శాతానికి పైగా పెరగడం గమనార్హం.

అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో జపాన్ ప్రధాని సనయే తకైచి సమావేశం అయ్యారు. వైట్‌హౌస్‌లో ఈ భేటీ ఏర్పాటైంది. ఇరాన్‌పై అమెరికా దాడులు, హార్ముజ్ స్ట్రెయిట్ వంటి అంశాలు ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చాయి. ఈ చర్చలో ట్రంప్ పెరల్ హార్బర్‌ను ప్రస్తావించడం జపాన్ ప్రధానికి ఇబ్బందులకు గురి చేసింది. తకైచి అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడటాన్ని డొనాల్డ్ ట్రంప్ మెచ్చుకున్నారు. ఆమెకు ప్రత్యేకంగా ట్రాన్స్ లేటర్లు అవసరం లేదని కితాబిచ్చారు. ఈ సారి ఆమె వచ్చినప్పుడు, జపానీస్ నేర్చుకుంటానని నవ్వుతూ చెప్పారు.

అమెరికా- ఇజ్రాయెల్ దాడుల గురించి మిత్రదేశాలకు సమాచారం ఇవ్వకపోవడంపై విలేకరులు ప్రశ్నించగా.. సర్ ప్రైజ్ ఇవ్వాలనుకున్నందున ఎవరికీ చెప్పలేదని, దీని గురించి జపాన్ కే బాగా తెలుసునని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో పెరల్ హార్బర్ పై జపాన్ దాడి గురించి ప్రస్తావించారు. పెరల్ హార్బర్ పై దాడి గురించి ముందుకు ఎందుకు చెప్పలేదని తకైచీని ప్రశ్నించారు. ఇది ఆమెను ఇబ్బందులకు గురి చేసింది. దీనికి ఎటువంటి సమాధానం ఇవ్వలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+