విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లంచం ఇవ్వనందుకు బాలింతపై యాసిడ్ పోసిన నర్స్

విజయవాడలోని ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటుచేసుకొంది. లంచం ఇవ్వనందుకు గాను ఆసుపత్రిలో ప్రసవానికి వచ్చిన బాలింతపై ఓ నర్స్‌ యాసిడ్ పోసింది. ఈ ఘటనపై బాధితురాలి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

విజయవాడ: విజయవాడలోని ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటుచేసుకొంది. లంచం ఇవ్వనందుకు గాను ఆసుపత్రిలో ప్రసవానికి వచ్చిన బాలింతపై ఓ నర్స్‌ యాసిడ్ పోసింది. ఈ ఘటనపై బాధితురాలి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై ఆసుపత్రి సూపరింటెండ్ విచారణకు ఆదేశించారు.

తాడిగడపకు చెందిన జి. ప్రియాంక విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో జూలై 15వ, తేదిన ఓ పాపకు జన్మనిచ్చింది. అయితే ఆమె పాపకు జన్మనిచ్చిన తర్వాత ఆసుపత్రి నుండి డిశ్చార్చి అయింది.

Vijayawada: Denied bribe, nurse gives acid enema

అయితే ఆమె కుట్లకు ఇన్‌ఫెక్షన్ రావడంతో ఆసుపత్రిలో చేరాలని డాక్టర్లు ఆమెకు సలహ ఇచ్చారు. అయితే ఈ సలహమేరకు ఆమె జూలై 28వ, తేదిన ఆసుపత్రిలో చేరింది.

అయితే ఆమెకు చికిత్స అందించేందుకు గాను లంచం ఇవ్వాలని డ్యూటీలో ఉన్న నర్స్ కోరారు. అయితే ఆమె లంచం ఇచ్చేందుకు నిరాకరించింది.

చికిత్స చేసే సమయంలో నర్స్ ఉద్దేశ్యపూర్వకంగా బాధితురాలిపై యాసిడ్ పడేసిందని ప్రియాకం బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో బాధితురాలికి తోడలు, కాళ్ళపై యాసిడ్ గాయాలయ్యాయి.

అంతేకాదు యాసిడ్ పడిన ప్రాంతంలో నల్లటి మచ్చలు ఏర్పడ్డాయని బాధితురాలి బంధువులు చెప్పారు. అయితే ఈ ఘటనను నిరసిస్తూ వారు ఆసుపత్రి ఎదుట ఆందోలనకు దిగారు.ఈ విషయం తెలుసుకొన్న విజయవాడ పాత ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండ్ ఎన్.‌.శ్రీనివాస విఠల్ విచారణకు ఆదేశించారు.

English summary
Women associations have staged a protest at Old Government Hospital on Tuesday alleging that an attendant intentionally poured acid on a woman in postnatal care because she refused to bribe her. The woman’s relatives have complained to the hospital superintendent and she has immediately called an enquiry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X