కోర్టు వాయిదాకు తనకు బదులుగా డ్రైవర్! విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తపై జడ్జి సీరియస్..
విజయవాడ ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఓ పాత కేసు విషయంలో కోర్టు వాయిదాకు హాజరు కావాల్సిన ఓ రాజకీయ నేత భర్త తనకు బదులుగా డ్రైవర్ ను కోర్టుకు పంపాడు. చివరి నిమిషంలో ఇది కాస్తా బయటపడటంతో రచ్చ రచ్చ అయింది. కోర్టులో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేయడంతో క్షమాపణ చెప్పి బయటపడాల్సి వచ్చింది. నిన్న జరిగిన ఈ వివాదాన్ని ఓసారి పరిశీలిస్తే.. నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి భర్త అవుతు శ్రీనివాసరెడ్డి కేసు విచారణకు వచ్చింది.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం 2015 ఆగస్టులో జరిగిన నిరసనల్లో పాల్గొన్న ప్రస్తుత నగర డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి భర్త అవుతు శ్రీనివాసరెడ్డిపై అప్పట్లో కేసు నమోదైంది. విజయవాడ బస్టాండ్ దగ్గర జరిగిన ఈ ధర్నాలో పాల్గొన్న శ్రీనివాసరెడ్డిపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ ప్రజా ప్రజా ప్రతినిధుల కోర్టులో ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో నిన్న కోర్టు వాయిదాకు శ్రీనివాసరెడ్డి హాజరు కావాల్సి ఉంది. కానీ ఆయన హాజరు కాకుండా డ్రైవర్ ను పంపారు.

డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి భర్త అవుతు శ్రీనివాసరెడ్డి కోర్టుకు హాజరుకావాల్సి ఉండగా.. ఆయన స్ధానంలో డ్రైవర్ మురారిని లోపలికి పంపారు. కోర్టు గుమస్తా శ్రీనివాసరెడ్డి పేరు చదవగా.. ఆయనకు బదులుగా డ్రైవర్ మురారీ లోపలికి వెళ్లారు. దీంతో ఆయన తడబడుతూ కోర్టు హాల్లోకి వచ్చారు. వయసుల్లో కూడా బాగా తేడా ఉండటంతో కోర్టు సిబ్బంది గమనించి అడ్డుకున్నారు. దీంతో సదరు డ్రైవర్ జరిగిన విషయం చెప్పేశారు.
తాను అవుతు శ్రీనివాసరెడ్డిని కాదని, ఆయన బాత్ రూమ్ కు వెళ్లడంతో తాను వచ్చానన్నారు. దీంతో న్యాయమూర్తి గాయత్రీదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీనివాసరెడ్డి ఎక్కడున్నారో చూసి తన ముందుకు తీసుకురావాలని ఆదేశించారు. వెంటనే పోలీసులు వెళ్లి శ్రీనివాసరెడ్డిని జడ్డి ముందు హాజరుపర్చారు. కోర్టులంటే ఆషామాషీగా ఉందా అంటూ న్యాయమూర్తి సీరియస్ అయ్యారు. ఏదైనా ఉంటే లాయర్ కు చెప్పుకోకుండా డ్రైవర్ ను పంపడం ఏంటన్నారు. ఆయన సంజాయిషీ ఇచ్చుకోవడంతో తీసుకుని పంపేశారు.












Click it and Unblock the Notifications