విజయవాడ లోకో పైలట్ ను అందుకే చంపేశా.. ! బీహార్ నిందితుడి షాకింగ్..
విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో లోకో పైలట్ (ట్రైన్ డ్రైవర్) గా విధులు నిర్వహిస్తున్న ఎబొనేజర్ తాజాగా హత్యకు గురయ్యారు. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఆయన్ను ఓ వ్యక్తి బలంగా తలపై రాడ్డుతో కొట్టడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు బీహార్ కు చెందిన నిందితుడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.
బీహార్ లోని షైనీ దర్బారీకి చెందిన దేవ్ కుమార్ అనే వ్యక్తి లోకోపైలట్ ఎబొనేజర్ ను తలపై రాడ్డుతో కొట్టి చంపినట్లు సీసీ కెమెరా వీడియోల ఆధారంగా గుర్తించిన పోలీసులు తాజాగా గాలింపు చేపట్టారు. చివరికి ఇవాళ సీఐకి కనిపించడంతో పట్టుకుని అరెస్టు చేశారు. విచారణలో నిందితుడు వెల్లడించిన విషయాలు పోలీసుల్ని సైతం దిగ్భ్రాంతికి గురి చేశాయి. దీంతో అతని నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

బీహార్ నుంచి విజయవాడకు బతుకు తెరువు కోసం వచ్చిన దేవ్ కుమార్ .. వ్యసనాలకు బానిస అయ్యాడు. దీంతో డబ్పులు చాలక బెదిరింపులకు దిగుతున్నాడు. ఇదే క్రమంలో డబ్పులివ్వని వారిని చంపేందుకు కూడా సిద్దమవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన తనకు కనిపించిన లోకో పైలట్ ఎబొనైజర్ ను కూడా డబ్బులు అడిగాడని, దీంతో ఆయన తలపై రాడ్డుతో కొట్టి జేబులో ఉన్న రూ.750 తీసుకుని అక్కడి నుంచి పరారైనట్లు తెలిపాడు. దీంతో అతడు గతంలో ఇంకెవరినైనా ఇలా దాడులు చేసి కొట్టాడా అని ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications