Vijayawada MEMU Trains: ఈ విజయవాడ రైళ్లకు కోచ్ ల మార్పు..! ఈ తేదీల్లో..!
దక్షిణ కోస్తా రైల్వే పరిధిలో ఉన్న విజయవాడ స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే పలు రైళ్ల కోచ్ లలో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ నెలలో తూర్పు కోస్తా రైల్వే పరిధిలో జరిగే పూరీ జగన్నాథ రథయాత్ర కోసం కోచ్ లు అవసరం కావడంతో ఇక్కడి నుంచి పంపుతున్నారు. దీంతో ఆయా రైళ్లకు (Vijayawada Memu Trains) ప్రస్తుతం ఉన్న అత్యాధునిక కోచ్ ల స్ధానంలో తాత్కాలికంగా పాత కోచ్ లు అమర్చబోతున్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు కోరుతున్నారు.
విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు ప్రస్తుతం పలు మెమూ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇందులో పాసింజర్ రైళ్లు కూడా ఉన్నాయి. విజయవాడ-ఒంగోలు, విజయవాడ-మచిలీపట్నం, విజయవాడ-గూడూరు మార్గాల్లో ఈ మెమూ రైళ్లు ప్రతీ రోజూ రాకపోకలు సాగిస్తున్నాయి. వీటికి తాజాగా కొత్త ర్యాక్ లు అమర్చడంతో ప్రయాణికులు సంతోషంగా ప్రయాణాలు సాగిస్తున్నారు. ఇలాంటి సమయంలో వారికి మళ్లీ పాత కోచ్ లలో ప్రయాణాలు చేయాల్సిన పరిస్ధితి కొన్ని రోజుల పాటు ఎదురుకానుంది.
{image-memutrains1-27841783072337jpg telugu.oneindia.com}
విజయవాడ-ఒంగోలు మధ్య రాకపోకలు సాగించే రెండు రైళ్లు (67273, 67274)కు ఈ నెల 10వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ ఇలా పాత కోచ్ లు అమర్చబోతున్నారు. అలాగే విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్లే రైళ్లకు ఈ నెల 10వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ, అలాగే మచిలీపట్న నుంచి విజయవాడ వచ్చే మెమూ రైళ్లకు ఈ నెల 11 నుంచి 31 వరకూ ఇలా పాత కోచ్ లు ఉంటాయి. వీటితో పాటు విజయవాడ నుంచి గూడూరు వెళ్లే మెమూ రైళ్లకు ఈ నెల 10 నుంచి 30 వరకూ, గూడూరు నుంచి విజయవాడ వచ్చే రైళ్లకు ఈ నెల 11 నుంచి 31 వరకూ ఇలా పాత కోచ్ లు కనిపిస్తాయి. అయితే వీటి ప్రయాణ సమయాలు, స్టాప్ లు అన్నీ యథావిధిగా ఉంటాయని అధికారులు తెలిపారు.













Click it and Unblock the Notifications