విజయవాడ వాసులకు సూపర్ గుడ్ న్యూస్..!
ఏపీలో విజయవాడ వాసులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అందించింది. నగరంలో పర్యాటక ప్రాంతాలు ఉన్నప్పటికీ పూర్తిస్ధాయిలో వాటిని అభివృద్ధి చేయకపోవడం, స్దానికంగా ప్రజలు సేదతీరేందుకు అనువైన ప్రదేశాలు లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్ధితి. ఈ నేపథ్యంలో నగరంలో పర్యాటకులతో పాటు స్థానికులనూ ఆకట్టుకునేందుకు నగరపాలక సంస్థ త్వరలో కెనాల్ బోటింగ్ ప్రారంభించనుంది.
పర్యాటకులను ఆకర్షించేందుకు కెనాల్ బోటింగ్ కోసం ప్రణాళిక రూపొందించాలని కమిషనర్ ధ్యానచంద్ర ఇవాళ అధికారుల్ని ఆదేశించారు. పర్యాటకులను ఆకట్టుకునేలా కెనాల్ బోటింగ్ ప్లాన్ ఉండాలని సూచించారు. బందర్, ఏలూరు, రైవస్ కాలువలను సుందరీకరించడం, విజయవాడ సందర్శకులను మరింత ఆకట్టుకునేలా చేయడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఈ మేరకు కాలువల్ని సుందరీకరించి బోటింగ్ కు అవకాశం కల్పిస్తారు.

విజయవాడ వాసులకు సూపర్ గుడ్ న్యూస్..! #Vijayawada #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/gRGGlLPuiy
— oneindiatelugu (@oneindiatelugu) July 30, 2024
ఇవాళ వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర కాలువలను సందర్శించి పర్యాటకులను ఆకట్టుకునేలా బోటింగ్ ప్రణాళికను అంచనా వేసి రూపకల్పన చేశారు. కాలువలకు ఇరువైపులా పచ్చదనాన్ని పెంపొందించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పాలని ఆయన సూచించారు. కాల్వల్లో వ్యర్థాలను పారవేయడాన్ని పర్యవేక్షించడానికి, నిరోధించడానికి డ్రోన్‌లను ఉపయోగించాలని, ఉల్లంఘించినవారికి జరిమానాలు విధించాలని ఆయన ఆదేశించారు. నగరంలో కృష్ణా కాలువల నీరు సమీప గ్రామాలకు తాగునీరుగా ఉపయోగపడుతుందని, కాబట్టి ప్లాస్టిక్ వ్యర్థాలు నీటిలోకి చేరకుండా తేలే పైపులను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే కాలువల నుండి వ్యర్థాలను సేకరించి తొలగించడానికి నెట్‌లు, కన్వేయర్ బెల్ట్‌లను వాడాలన్నారు.












Click it and Unblock the Notifications