ఏమైంది: విజయవాడలో న్యూస్ యాంకర్ ఆత్మహత్య
విజయవాడలో ఓ న్యూస్ యాంకర్ ఆత్మహత్య కలకలం రేపింది. ఓ న్యూస్ ఛానెల్‌లో యాంకర్‌గా పనిచేస్తున్న తేజశ్విని అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. తేజశ్విని మృతికి కుటుంబ కలహాలే కారణం అని తెలుస్తోంది.
విజయవాడలోని ఈడుపుగల్లు ఎంబీఎంఆర్ కాలనీలో తన భర్త, అత్తమామలతో కలిసి తేజశ్విని ఉంటోంది. భర్త పవన్ కుమార్ ఉయ్యూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. నిన్న రాత్రి తన అత్త అన్నపూర్ణతో తేజశ్విని గొడప పడ్డట్లు సమాచారం. వెంటనే ఓ గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకుంది. గదిలోనుంచి ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో అనుమానం ఆమె అత్తకు అనుమానం వచ్చింది.

వెంటనే తలుపులు పగలగొట్టగా అప్పటికే ఫ్యాన్‌కు వేలాడుతూ తేజశ్విని కనపించింది. వెంటనే పోలీసులు ఫిర్యాదు చేయగా... ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications