Crime News: మాట కలిపేది.. పార్టీలకు పిలిచేది.. మత్తు మందు ఇచ్చి నగ్న ఫొటోలు తీసేది.. ఆ తర్వాత..

మోసగాళ్లు మన పక్కనే ఉంటారు.. చాలా అమాయకంగా కనిపిస్తారు.. కానీ మనం మోసం పోయినప్పుడే తెలుస్తుంది వాళ్లు దుర్మర్గులని. ఇలా ఓ మహిళ వస్త్ర దుకాణం నడుపుతూ అందులో పని చేయడానికి మహిళలను లోబరుచుకుని వ్యభిచారం చేయించేది. చివరికి పోలీసులకు చిక్కింది.
విజయవాడ పడమటకు చెందిన ఓ మహిళా స్థానికంగా వస్త్ర దుకాణం నడుపుతుంది. ఈ షాపులో పని చేయడానికి మహిళలను నియమించుకునేది. వారికి పార్టీలు ఇస్తూ, గిఫ్ట్ లు ఇస్తూ ఆకట్టుకునేది. పార్టీకి వచ్చిన మహిళలకు కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చేది. ఇలా వారు స్పృహ తప్పగానే వారిని వీడియోలు, ఫొటోలు తీసేది.

వీడియోలు, ఫొటోలు
ఆ తర్వాత ఆ వీడియోలు, ఫొటోలను చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేసి వారిని వ్యభిచార రోంపిలోకి దించేది. ఇలా చాలా రోజులు పాటు జరిగింది. చివరికి ఓ మహిళ ధైర్యంతో పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం బయటకొచ్చింది.ఈ విషయాన్ని ఇద్దరు యువతులు విజయవాడ పోలీసు కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. దీన్ని సీరియస్ తీసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మహిళపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో అనేకసార్లు ఫిర్యాదు వెళ్లినప్పటికీ పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి.

 Vijayawada police arrested a woman who was blackmailing young women and dragging them into prostitution.

పార్టీలకు పిలిచి
ఈ మహిళ దుకాణంలో పని చేస్తున్న మహిళలతో పాటు షాపుకు వచ్చే యువతులను తన మాటలతో ఆకట్టుకునేది. వారి ఫోన్ నెంబర్లు తీసుకుని కిట్టిపార్టీలకు రామ్మని ఫోన్ చేసేది. ఇది నమ్మి వారు పార్టీలకు వచ్చే వారు. ఇలా పార్టీలకు వచ్చిన మహిళలకు కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇస్తుంది. ఇలా వారి న్యూడ్ ఫొటోలను తన ఫోన్ లో తీసుకునేది. ఆ తర్వాత మహిళలకు ఫోన్ చేసి వ్యభిచారం చేస్తే భారీగా డబ్బు వస్తుందని చెప్పేది. అయినా వినని వారికి ఈ ఫొటోలు, వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేసేదని పోలీసుల విచారణలో తేలింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+