అమెరికా లో ఉద్యోగాల పేరిట ఘరానా మోసం, కోటి వసూలు
విజయవాడ: అమెరికాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని 65 మంది నుండి కోటి రూపాయాలను వసూలు చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

కృష్ణా జిల్లా పెనమలూరు కు చెందిన కోటయ్య అనే వ్యక్తి అమెరికా లో ఉద్యోగాలు ఇపిస్తానని 65 మంది నుంచి కోటి రూపాయలు వసూలు చేశాడు. ఉద్యోగాల కోసం110 మంది నిరుద్యోగుల కు పాస్ పోర్టులను తీసుకుని తన దగ్గర పెట్టుకున్న కోటయ్య ఎవరికీ ఉద్యోగాలు ఇప్పించలేదు.
110 మందికి ఏడాది నుంచి ఇదే విధంగా మాయ మాటలు చెప్పటంతో పోలీసులకు భాదితులు ఫిర్యాదు చేశారు.
పోలీసులకు 35 మంది బాధితుల ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులు చేసే బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు పోలీసులు. అయితే కోటయ్యకు సహకరించిన సురేష్ అనే వ్యక్తి ని పోలీసులు ప్రస్తుతం అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications