Vijayawada New Year 2023 : విజయవాడలో న్యూ ఇయర్ ఆంక్షలివే..
2022కు గుడ్ బై చెప్పేసి కొత్త ఏడాది 2023కి స్వాగతం చెప్పే సమయం సమీపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలకు రంగం సిద్ధమవుతోంది. అదే సమయంలో ఈ వేడుకల్ని క్షేమంగా, సురక్షితంగా జరుపుకునేందుకు వీలుగా ఆంక్షల కత్తి కూడా వేలాడుతోంది. ఏపీలోని విజయవాడ పోలీసులు కూడా న్యూఇయర్ వేడుకలకు ఆంక్షల్ని ప్రకటించారు. ఈ మేరకు నగర పోలీసు కమిషనర్ క్రాంతి రాణా టాటా ఆంక్షల్ని వెల్లడించారు.
రేపు 31వ తేదీ అర్ధరాత్రి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని సీపీ క్రాంతి రాణా టాటా ప్రకటించారు. బందరు రోడ్డు లో బైక్స్, కార్లు వేసుకుని ర్యాలీలు నిర్వహించరాదని ఆయన తెలిపారు. న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించే వారు పోలీస్ పర్మిషన్ తీసుకోవాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని సూచిస్తున్నారు.
ఆంక్షలు ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ ప్రకటించారు.

ఈ ఏడాది విజయవాడ నగరంలో నేరాలు 30 శాతం మేర తగ్గినట్లు సీపీ క్రాంతి రాణా టాటా వార్షిక నివేదికలో వెల్లడించారు. గత సంవత్సరం డిసెంబర్ కు 12394 నేరాలు నమోదు కాగా.. ఈ సంవత్సరం 7767 మాత్రమే నమోదైనట్లు తెలిపారు. దిశ పెట్రోలింగ్ ఈ ఏడాది మంచి ఫలితాలను ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. గత సంవత్సరం నుండి శ్రద్ద పెట్టడం వలన నేరాల రేటు తగ్గిందని సీపీ పేర్కొన్నారు. 99శాతం మిస్సింగ్ కేసులను ట్రేస్ చేశామన్నారు. ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు మాత్రం కాస్త పెరిగాయన్నారు. 1800 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.
లోన్ యాప్స్ కు భయపడవద్దని, నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు. మహిళలపై జరిగిన నేరలకు శిక్షలు ఎక్కువగా పడ్డాయని సీపీ వెల్లడించారు.లా అండ్ కంట్రోల్ చేశామన్నారు. గంజాయి కేసులు తగ్గాయని, కార్టన్ సెర్చ్ లు కూడా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సమస్యాత్మక ప్రదేశాలలో బ్లేడ్, గంజాయి బ్యాచ్ లపై నిఘా పెంచామన్నారు. డ్రగ్స్ వాడకం నియంత్రణ కోసం 80 అవగాహనా కార్యక్రమాలు చేపట్టామన్నారు.
దిశ కింద 250 ఫిర్యాదులు, 216 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications