సీపీఎస్ మిలియన్ మార్చ్ కు రావొద్దు-ఉద్యోగులకు విజయవాడ పోలీసుల హెచ్చరికలు

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ ను రద్దు చేయాలని కోరుతూ ఉద్యోగులు కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ప్రభుత్వంతో ఉద్యోగులు జరిపిన చర్చలు వరుసగా విఫలమవుతున్నాయి. దీంతో సెప్టెంబర్ 1న మిలియన్ చేపట్టాలన్న తమ నిర్ణయంలో మార్పు లేదని వారు తాజాగా ప్రకటించారు. మిలియన్ మార్చ్ లో భాగంగా విజయవాడ చేరుకుని అక్కడి నుంచి సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించాలనేది వారి ఆలోచన.

అయితే విజయవాడలో మిలియన్ మార్చ్ నిర్వహణ కోసం ఉద్యోగులకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు ఇవాళ ప్రకటించారు. సెప్టెంబర్ 1న ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఉద్యోగుల సంఘం, ఇతర ఉద్యోగ సంఘాల వారు వివిధ రకాల నిరసన కార్యక్రమాలు విజయవాడ నగరంలో జరుపుటకు పిలుపు ఇచ్చారని, అయితే ఈ కార్యక్రమాలకు స్థానిక పోలీస్ అధికారుల వద్ద నుంచి లేదా ప్రభుత్వం నుంచి ఏ విధమైన అనుమతులు లేవని వారు ప్రకటించారు.

vijayawada police warns employees against attending cps million march on september 1

విజయవాడ నగరంలో ప్రస్తుతం సెక్షన్ 144 సిఆర్.పి.సి., పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 ప్రకారం నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాలను అదునుగా చేసుకుని కొంతమంది అసాంఘిక శక్తులు విజయవాడ పరిసర ప్రాంతాలలో రెక్కీ నిర్వహించి శాంతి భధ్రతలకు విఘాతం కల్గించే విధంగా, ప్రభుత్వ, రైల్వే ఆస్తులపై చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న సమాచారం కూడా ఉందన్నారు.
నిబంధనలను అతిక్రమించి ధర్నాలు, నిరసనలు చేపట్టే వారిపై ఐపీసీ సెక్షన్ 143, 427, 452, 283, 341, 506, 120(B), R/W 149 క్రింద, పి.డి.పి.పి.చట్టం ప్రకారం (ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం) సెక్షన్ 3 కింద, రైల్వే చట్టం ప్రకారం సెక్షన్ 141,146,147,151 కింద కేసులు నమోదు చేస్తామని సీపీ కాంతిరాణా టాటా హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+