Mohith Majety : అంతర్జాతీయ అబిలింపిక్స్ కు విజయవాడ వాసి మోహిత్ మాజేటి..
ఒలింపిక్స్, పారాలంపిక్స్ కు భిన్నంగా అబిలింపిక్స్ లో దివ్యాంగుల ఇతర సామర్ధ్యాలను గుర్తించే పోటీల్ని నిర్వహిస్తారు.
విజయవాడ : ఈ ఏడాది ఫ్రాన్స్ లోని మెట్జ్ నగరంలో జరిగే అంతర్జాతీయ అబిలింపిక్స్ పోటీల్లో పాల్గొనేందుకు భారత్ నుంచి ఇద్దరు దివ్యాంగులు ఎంపికయ్యారు. వీరిలో ఏపీకి చెందిన మోహిత్ మాజేటితో పాటు చెన్నెకు చెందిన పి సాయికృష్ణన్ కూడా ఉన్నారు. వీరిద్దరూ త్వరలో ఫ్రాన్స్ లో జరిగే ఈ అబిలింపిక్స్ లో తమ సత్తా చాటుకోనున్నారు.
ఒలింపిక్స్, పారాలింపిక్స్ వంటి క్రీడా పోటీలకు భిన్నంగా దివ్యాంగులు ఆటలు కాకుండా తమ విభిన్న నైపుణ్యాలను ప్రదర్శించేందుకు వీలుగా ఈ అబిలింపిక్స్ నిర్వహిస్తున్నారు. ఇదో ప్రత్యేకమైన ఫార్మాట్. ఇది పరస్పరం పోటీ పడటం ద్వారా దివ్యాంగులు తమ ప్రత్యేక నైపుణ్యాలను ప్రదర్శించేందుకు వీలు కల్పించే ఫార్మాట్. ఇందులో బేకరీ, సైకిల్ అసెంబ్లింగ్, క్యాబినెట్ తయారీ, వెబ్ పేజీలను సృష్టించడం, డేటా ప్రాసెసింగ్, మల్టీమీడియా జర్నలిజం, వెల్డింగ్, కార్పెంటరీ, ప్రచురణ వంటి క్రాఫ్ట్‌లలో ప్రత్యేక సామర్థ్యం గల వ్యక్తులు తమ విక్రయ నైపుణ్యాలను ప్రదర్శించే పోటీలు ఉంటాయి.













Click it and Unblock the Notifications