శాతవాహన ఎక్స్ ప్రెస్ లో వెళ్లే వారికి అదిరిపోయే న్యూస్..!

దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ -సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించే శాతవాహన ఎక్స్ ప్రెస్ రైళ్లలో (నం.12713/12714)లో ప్రయాణించే వారికి అధికారులు ఇవాళ గుడ్ న్యూస్ చెప్పారు. ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ గా పాపులర్ అయిన ఈ రైళ్లలో ప్రయాణించే వారి భద్రత, సౌకర్యం కోసం ఓ కీలక మార్పు చేశారు. దీని ఉపయోగాలను వివరిస్తూ దక్షిణ మధ్య రైల్వే ఇవాళ ఓ ప్రకటన విడుదల చేసింది.

విజయవాడ-సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య రాకపోకలు సాగిస్తున్న శాతవాహన ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రస్తుతం ఉన్న ICF కోచ్‌ల స్థానంలో ఆధునిక లింకే హాఫ్‌మన్ బుష్ (LHB) కోచ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రయాణీకులకు సురక్షితమైన, మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని ఇవ్వడానికి ఇలా కోచ్ లను మారుస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ కోచ్ ల మార్పు వల్ల ప్రయాణికులకు కలిగే సౌకర్యాలను కూడా వివరించారు.

Vijayawada-Secunderabad Satavahana Express upgraded with LHB Coaches now for Safety and Comfort

ఈ అధునాతన LHB కోచ్ ల వల్ల ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభవం లభిస్తుందన్నారు. మెరుగైన కుషనింగ్, ఎయిర్ సస్పెన్షన్ సిస్టమ్‌లు, విశాలమైన విండోలతో సమర్థతాపరంగా సీట్లను రూపొందించినట్లు తెలిపారు. అలాగే LHB కోచ్‌ల మెరుగైన స్థిరత్వంతో రైలు అధిక వేగంతో ప్రయాణించే అవకాశం లభించింది. అలాగే ఆధునిక ఇంటీరియర్స్, మెరుగైన వెంటిలేషన్, నాయిస్ తగ్గింపు ఫీచర్లు ప్రీమియం ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయన్నారు.

ఎల్‌హెచ్‌బి కోచ్‌లు యాంటీ-క్లైంబింగ్ టెక్నాలజీ, మెరుగైన క్రాష్‌వర్తినెస్‌తో సహా అధునాతన భద్రతా ఫీచర్లతో రూపొందించబడ్డాయని అధికారులు చెప్తున్నారు. పట్టాలు తప్పే ప్రమాదాన్ని తగ్గించడం, ప్రయాణీకుల రక్షణకు భరోసా ఇవ్వడం వీటి లక్ష్యం. అలాగే హాట్ బఫే కారు పూర్తిగా ఎయిర్ కండిషన్ చేశారు. అలాగే ఇండక్షన్ ఫ్లేమ్ వంటతో ఇన్‌స్టాల్ చేశారు. ఆటోమేటిక్ ఫైర్ డిటెక్షన్ , సప్రెషన్ సిస్టమ్‌తో వీటిని రూపొందించారు.

ఎల్‌హెచ్‌బి కోచ్‌ల ప్రవేశంతో శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులు సురక్షితమైన, సాఫీగా, మరింత ఆనందదాయకమైన ప్రయాణాన్ని అనుభవించవచ్చని సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ నరేంద్ర ఎ పాటిల్ తెిపారు. భారతీయ రైల్వేలు, దాని మౌలిక సదుపాయాలను, రోలింగ్ స్టాక్‌ను ఆధునీకరించడానికి తమ నిబద్ధతకు ఇది నిదర్శనం అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+