100ఏళ్ల క్రితమే రాజధానిగా విజయవాడ (పిక్చర్స్)
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో సీమాంధ్రకు కొత్త రాజధాని విజయవాడగా అధికారిక ప్రకటన జారీ కావడంతో కృష్ణ జిల్లా ప్రజల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఐతే విజయవాడ రాజధానికి ఈ తరానికి కొత్త కావచ్చు, కానీ వందల సంవత్సరాల క్రితమే కృష్ణానదితీరం వెంబడి అనేక రాజధానులు వెలిశాయి. ఎంతో మంది రాజులు పరిపాలన సాగించారు. అసలు తెలుగు జాతికి తొలి రాజధానిని విజయవాడ-అవనిగడ్డ మధ్య గల శ్రీకాకుళం అనేది మరచిపోకూడదు.
ఆంధ్ర మహావిష్ణువు ఈ రాజధానిని నిర్మించగా, ఆ తర్వాత ఎందరో రాజులు ఇక్కడనే పరిపాలించారు. కొండపల్లిని రెడ్డి రాజులు, గజపతులు, బహమనీ సుల్తానులు, గోల్కోండ రాజులు, నిజాం నవాబులు రాజధానిగా ఏర్పాటు చేసుకోని పరిపాలించారు. ఆ తర్వాత కాలంలో బ్రిటిష్ వారి రాకతో దీని ప్రాముఖ్యత తగ్గి మచిలీపట్నానికి ప్రధాన్యత పెరిగింది.
బెజవాడ, మీర్జాపూర్, నూజివీడు, ఉయ్యూరు, తోట్లవల్లూరు, కోడూరు, అవనిగడ్డ కూడా కొన్ని సందర్బాల్లో రాజధానిగా పాలన సాగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ప్రకటన వెలువడిన మరుక్షణంలో దేశ, విదేశాల్లో విజయవాడ మార్మోగుతోంది. విజయవాడ జిల్లా కేంద్రం కాకపోయినా రాజకీయ, వాణిజ్య, వ్యాపార కూడలిగా రవాణా, సాంస్కృతిక విద్యా కేంద్రంగా దేశంలోనే విశిష్టస్దానం పొందిన విజయవాడకు రెండువేల ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది.
ఇంద్రకీలాద్రి పర్వతంపై లభించిన క్రీ.శ. 927-933 కాలం నాటి 2వ యుద్ధమల్లుని శాసనం ప్రకారం నేటి విజయవాడ రాజేంద్ర చోళపురంగా విరిసిల్లింది. అప్పటికే బెజవాడ, హెచ్చవాడ, విజయవాటికగా పిలువబడి నేడు విజయవాడగా పిలుస్తున్నారు. ఇలాంటి నగరంలో రాజధాని ఏర్పానా పేరు మార్చవద్దని చరిత్రకారులు అభిప్రాయాన్ని తెలిపారు. శాతవాహనుల కాలం నుంచి విశిష్టమైన సాంస్కృతిక చరిత్ర కలిగి ఉందని పురాతత్వ శాస్తజ్ఞ్రుల తెలిపారు.
బౌద్ధమతానికి, జైన మతానికి ఒకప్పుడు విజయవాడ కేంద్రం. క్రీస్తుశకం 715-755 మధ్య కాలంలో కుబ్జా 1వ విష్ణువర్దన్ రాజు పాలనా కాలంలో ఈనగరం జైన మతానికి పెట్టినపేరు. క్రీస్తుశకం 927-933 మధ్య కాలంలో పరిపాలించిన యుద్ధమల్లుని కాలంలో కార్తికేయుని ఆలయం నిర్మాణం జరిగింది.

సీమాంధ్రకు కొత్త రాజధాని విజయవాడ
విజయవాడ జిల్లా కేంద్రం కాకపోయినా రాజకీయ, వాణిజ్య, వ్యాపార కూడలిగా రవాణా, సాంస్కృతిక విద్యా కేంద్రంగా దేశంలోనే విశిష్టస్దానం పొందిన విజయవాడకు రెండువేల ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది.

సీమాంధ్రకు కొత్త రాజధాని విజయవాడ
బౌద్ధమతానికి, జైన మతానికి ఒకప్పుడు విజయవాడ కేంద్రం. క్రీస్తుశకం 715-755 మధ్య కాలంలో కుబ్జా 1వ విష్ణువర్దన్ రాజు పాలనా కాలంలో ఈనగరం జైన మతానికి పెట్టినపేరు.

సీమాంధ్రకు కొత్త రాజధాని విజయవాడ
ఇంద్రకీలాద్రి పర్వతంపై లభించిన క్రీ.శ. 927-933 కాలం నాటి 2వ యుద్ధమల్లుని శాసనం ప్రకారం నేటి విజయవాడ రాజేంద్ర చోళపురంగా విరిసిల్లింది. అప్పటికే బెజవాడ, హెచ్చవాడ, విజయవాటికగా పిలువబడి నేడు విజయవాడగా పిలుస్తున్నారు.

సీమాంధ్రకు కొత్త రాజధాని విజయవాడ
ఆంధ్ర మహావిష్ణువు ఈ రాజధానిని నిర్మించగా, ఆ తర్వాత ఎందరో రాజులు ఇక్కడనే పరిపాలించారు. కొండపల్లిని రెడ్డి రాజులు, గజపతులు, బహమనీ సుల్తానులు, గోల్కోండ రాజులు, నిజాం నవాబులు రాజధానిగా ఏర్పాటు చేసుకోని పరిపాలించారు.












Click it and Unblock the Notifications