షో చేసేవాళ్లు కాదు..విషయం ఉన్నవాళ్లు కావాలి: కేశినేని నాని లక్ష్యం ఆయనేనా?
టీడీపీలో ట్వీట్లతో కొంత కాలంగా కలకలం సృష్టిస్తున్న ఎంపి కేశినేని నాని మరో ట్వీట్ చేసారు. పార్టీ ఎన్నికల్లో ఓడిన తరువాత తనకు ఇచ్చిన పదవులను సైతం వద్దని చెప్పిన నాని ట్వీట్ల ద్వారా తన అసంతృప్తిని బయట పెడుతున్నారు. గల్లా జయదేవ్..దేవినేని ఉమా..బుద్దా వెంకన్న ఇలా..వరుసగా టార్గెట్ చేసారు. ఇక, ఇప్పుడు మరో ట్వీట్‌లో ఇప్పుడు టీడీపీకి షో చేసే వారకు కాదని..విషయం ఉన్న వాళ్లు కావాలంటూ కామెంట్ చేయటం చర్చనీయాంశంగా మారింది. అసలే సమస్యల్లో ఉన్న టీడీపీలో ఇప్పుడు ఈ ట్వీట్లు కలకలం సృష్టిస్తున్నాయి.
కేశినేని నాని లక్ష్యం ఎవరు..
విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని తాజాగా ట్వీట్ చేసారు. అందులో షో చేసేవాళ్లు కాదు..విషయం ఉన్న వాళ్లు ఇప్పుడు టీడీపీకి కావాలంటూ పోస్ట్ చేసారు. అయితే, నాని వరుస పోస్టులతో సతమతం అయిన టీడీపీ అధినాయకత్వం కొద్ది రోజు లుగా విరామం ఇవ్వటంతో ఊపిరి పీల్చుకుంది. ఇక, ఇప్పుడు ఆయన తాజాగా చేసిన ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేసారనే విషయం పైన చర్చ మొదలైంది. కేశినేని తొలి నుండి మంత్రి దేవినేని ఉమా వైఖరి మీద అసంతృప్తితో ఉన్నారు. అదే విధంగా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పైనా ఆగ్రహంతో ఉన్నారు.

Recommended Video

గత ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి కేశినేని నాని తనతో సఖ్యతగా ఉండే నేతను అక్కడ పార్టీ అభ్యర్దిగా అవకాశం ఇవ్వాలని ప్రతిపాదించారు. ఆ సమయంలో బుద్దా వెంకన్న పార్టీ అధినేత వద్ద ఆయన ప్రతిపాదించిన అభ్యర్దికి వ్యతిరేకంగా చెప్పి..మరొకరికి సీటు ఇవ్వటానికి కారణమయ్యారని నాని మద్దతు దారులు చెబుతూ ఉంటారు. అప్పటి నుండి నాని - బుద్దా వెంకన్న మధ్య గ్యాప్ వచ్చిందని చెబుతారు. ఈ మధ్య కాలంలో వెంకన్న సైతం ట్వీట్ల ద్వారానే అధికార పార్టీని విమర్శిస్తున్నారు.
ఆ కార్యక్రమం మీదే ఆగ్రహమా..
ఇక ఇదే సమయంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్..మాజీ మంత్రి దేవినేని ఉమా.. గన్నవరం ఎమ్మెల్యే వంశీ ముగ్గురూ నూజివీడులో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో పట్టిసీమ ద్వారా కృష్ణాలోకి వచ్చే గోదావరి నీటికి హారతులు ఇవ్వాలని నిర్ణయించారు. దీని గురించి పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. అదే సందర్భం లో విమర్శలు మొదలయ్యాయి. కేశినేని నానికి ఈ కార్యక్రమానికి ఆహ్వానం లేదు.
జిల్లా నుండి ఒక ఎంపీ..ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే తాజా ఎన్నికల్లో గెలిచారు. అందులో వంశీకి మినహా మిగిలిన వారంతా తాజా ఎన్నికల్లో ఓడిన నేతలే. దీంతో..ఇప్పుడు వీరిని ఉద్దేశించి నాని ఈ ట్వీట్ చేసారా అనే చర్చ సైతం మొదలైంది. ఇప్పటికే టీడీపీలో అంతర్గత సమస్యలతో సతమతం అవుతున్న వేళ..ఇటువంటి కార్యక్రమాలు..వర్గా పోరు..అసమ్మతి ట్వీట్లు పార్టీలో మరింత గందరగోళం సృష్టిస్తున్నాయి.
-
Vijayawada: విజయవాడలో నాన్ వెజ్ బంద్-ఇవాళ రాత్రి నుంచే..! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ!












Click it and Unblock the Notifications