ఆ విజయవాడ లారీ డ్రైవర్ - కోల్ కతా వెళ్లొచ్చి ఎంత మందికి అంటించాడంటే...
విజయవాడలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే సెంచరీ దాటేసిన కేసులకు చిత్ర విచిత్రమైన కారణాలని సైతం గుర్తించిన పోలీసులు.. వీటిపై ఆరంభంలో దృష్టి పెట్టి ఉంటే పరిస్ధితి చేజారేది కాదని వాపోతున్నారు. ఇలాంటిదే మరో కేసు తాజాగా బయటపడింది. కోల్ కతా నుంచి వచ్చిన ఓ లారీ డ్రైవర్ కారణంగా నగరంలో వైరస్ సోకడంతో వీరంతా ఇప్పుడు ఆస్పత్రుల్లో చికిత్స కోసం చేరిపోయారు.
విజయవాడ కృష్ణ లంకలో నివాసముంటున్న ఓ లారీ డ్రైవర్ తాజాగా లాక్ డౌన్ సడలింపుల తర్వాత కోల్ కతా మార్కెట్లకు వెళ్లాడు. అక్కడ లారీ రోడ్ చేసుకుని తిరిగి నగరానికి వచ్చాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో పాటు ఇతర డ్రైవర్లతో కలిసి తిరిగాడు. చివరికి కరోనా లక్షణాలు కనిపించడంతో అధికారులు వెంటనే గుర్తించి ఆస్పత్రికి చికిత్స కోసం పంపారు. అప్పటికే అతని కారణంగా 8 మందికి కరోనా సోకినట్లు గుర్తించారు.. వీరికి వెంటనే పరీక్షలు నిర్వహించి కరోనా నిర్ధారించుకున్నాక ఐసోలేషన్ వార్డులకు పంపారు.

Recommended Video
కరోనా లాక్ డౌన్ మినహాయింపులు ఎంత ప్రమాదకరం అన్న దానికి ఇదే ఉదాహరణ కానుందని విజయవాడలో స్ధానికులు చెబుతున్నారు. నిత్యావసరాల రవాణా పేరుతో గూడ్స్ వాహనాలను రోడ్లపైకి తాజాగా అనుమతించిన నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను పట్టించుకుకోవడం వల్ల కూడా కరోనా వ్యాప్తి చెందుతుందనే అనుమానాలున్నాయి.












Click it and Unblock the Notifications