సచివాలయ ఉద్యోగుల పోరుబాట, అల్టిమేటం- వాట్సాప్‌ గ్రూప్‌ ల నుంచి ఎగ్జిట్..!!

గ్రామ సచివాలయ ఉద్యోగులు పోరుబాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసనలకు సిద్దం అవుతున్నారు. వాలంటీర్ల విధులను తమకు కేటాయించటం పైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిని తాము నిర్వహించబోమని తేల్చి చెప్పారు. నోషనల్ ఇంక్రిమెంట్లు.. అరియర్స్ మంజూరు చేయాలని డిమాండ్ చేసారు. ఈ నెల 10వ తేదీన విజయవాడ మార్చ్ నిర్వహిస్తామని సచివాలయ ఉద్యోగుల జేఏసీ తాజాగా ప్రకటించింది.

సచివాలయాల ఉద్యోగులు ఆందోళనకు సిద్దం అవుతున్నారు. గ్రామ సచివాలయం కేంద్రంగా పనిచేస్తున్న వివిధ శాఖల ఉద్యోగులు పోరుబాట పడుతున్నారు. సచివాలయం కేంద్రంగా సుమారు 13 శాఖల సిబ్బంది పని చేస్తున్నారు. వారికి మాతృ శాఖ పనులు కాకుండా డోర్‌ టూ డోర్‌ సర్వేలు, పింఛన్ల పంపిణీ వంటి పనులకు పురమాయించడం పట్ల వారు కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారు. పంచాయతీ సెక్రటరీ మొదలు ఎంపిడిఒ, అన్ని శాఖల అధికారుల అజమాయిషీ కొనసాగడం పట్ల అసంతృప్తికి గురవుతున్నారు. వీటిపై పలు దఫాలు అధికారుల వద్ద ఏకరువు పెట్టారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. ఇతర శాఖల అదనపు పనులు తప్పించాలని, వేతనాలు మాతృ సంస్థ చెల్లించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర స్థాయిలో కార్యాచరణ రూపొందించారు. అందులో భాగంగా దశలవారీ ఆందోళనకు సిద్ధం అవుతున్నారు.

village-secretariat-employees-protest-against-latest-duties-allocation-details-here

దీంతో, తాజాగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సచివాలయ ఉద్యోగ సంఘాలతో వెంటనే చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షాన అక్టోబర్‌ ఒకటిన సామాజిక పింఛన్లను పంపిణీ చేయబోమని జెఎసి రాష్ట్ర స్థాయిలో నోటీస్‌ ఇచ్చింది. కాగా, రాష్ట్ర స్థాయిలో కొన్ని జిల్లాల్లో సిబ్బంది ఈ పాటికే తమ నిరసన వ్యక్తం చేస్తూ కొందరు ఉద్యోగులు అధికారిక వాట్సాప్‌ గ్రూప్‌ నుంచిఎగ్జిట్ . ప్రకాశం జిల్లాలో కూడా కొందరు ఉద్యోగులు వారి అధికారిక వాట్సాప్‌ గ్రూపుల నుంచి ఎగ్జిట్‌ అయ్యారు. జిల్లాలో ఒకటి రెండు రోజుల్లో తమ కార్యాచరణ ప్రకటిస్తామని సచివాలయ ఉద్యోగ జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. ఈ నెల 10న ఉద్యోగుల విజయవాడ మార్చ్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పుడు ప్రభుత్వం వీరి విషయంలో ఏ రకంగా స్పందిస్తుందీ.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది కీలకంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+