వైసీపీ దెబ్బకు సచివాలయానికి తాళం, కుప్పంలో వైసీపీ నాయకులు ఏం చేశారంటే ?
గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడపడితే అక్కడ గ్రామ, వార్డు సచివాలయాలు నిర్మించారు. నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో భవనాల అద్దెకు తీసుకుని సచివాలయాలు నిర్వహించారు. సచివాలయాల్లో ఉంటున్న వాలంటీర్లు విధుులు నిర్వహించారు. సచివాలయాలు లేదంటే ప్రభుత్వమే నడవదు అనే రీతిలో వైసీపీ నాయకులు వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.
అలాంటి సచివాలయాల్లో కొంతమంది వాలంటీర్లు కాలం గడుపుతూ వైసీపీ నాయకులతో కలిసి రాజకీయాలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. అయితే వైసీపీ నాయకులు నిర్లక్ష్యం కారణంగా ఒక సచివాలయానికి గ్రామస్తులు తాళం వేయడం హాట్ టాపిక్ అయ్యింది. సచివాలయం నిర్మించడం కోసం వైసీపీ నాయకులు దంపతుల దగ్గర స్థలం ఇప్పించుకున్నారు. తర్వాత ఆ కుటుంబానికి జగనన్న లేఔట్ లో ఇంటి స్థలం ఇస్తామని, ఇంటిని నిర్మించి ఇస్తామని మాయమాటలు చెప్పి ఇన్ని రోజులు కాలం గడిపేశారు.

గతంలో ఉన్న ఇంటి స్థలం పోవడం, జగనన్న లేఔట్ లో ఇంటి స్థలం, ఇల్లు రాకపోవడం ఉండడానికి నీడ లేకపోవడంతో వైసీపీ నాయకులపై ఆ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రామస్తులు సహాయంతో సచివాలయానికి తాళం వేసిన ఆ కుటుంబం మాకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులకు మనవి చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం సమీపంలోని వి.కోట సమీపంలోని జువ్వనిపల్లెలో సోమశేఖర్, రూపా దంపతులు నివాసం ఉంటున్నారు.
సోమశేఖర్, రూపా దంపతులకు గ్రామంలో ఓ ఇంటి స్థలం ఉంది. మూడు సంవత్సరాల క్రితం ఆ గ్రామంలో సచివాలయం నిర్మించడానికి సోమశేఖర్, రూపా దంపతుల ఇంటి స్థలం ఇవ్వాలని వైసీపీ నాయకులు అడిగారు. మీరు గ్రామంలో ఇంటి స్థలం ఇస్తే వీ.కోటలో జగనన్న లేఔట్ లో ఇంటి స్థలం ఇస్తామని, ఇల్లు కూడా నిర్మించి ఇస్తామని సోమశేఖర్, రూపా దంపతులకి వైసీపీ నాయకులు మాయ మాటలు చెప్పారు.
వైసీపీ నాయకుల మాటలు నమ్మిన సోమశేఖర్, రూపా దంపతులు వాళ్ల భూమిని సచివాలయం నిర్మాణం కోసం ఇచ్చేశారు. వారి స్థలంలో సచివాలయం నిర్మించిన వైసీపీ నాయకులు తరువాత సోమశేఖర్, రూపా దంపతులకు వీ. కోటలో ఇంటి స్థలం కాదు కదా నాలుగు అడుగుల భూమి కూడా ఇవ్వకుండా ఇంత కాలం గడిపేశారు. ఉన్న స్థలం పోవడం, జగనన్న లేఔట్ లో ఇంటి స్థలం రాకపోవడంతో సోమశేఖర్, రూపా దంపతులు వైసీపీ నాయకులను నిలదీశారు.

వైసీపీ నాయకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, సోమశేఖర్, రూపా దంపతులకు తిక్కతిక్క సమాధానాలు చెప్పడంతో ఆ దంపతులు సహనం కోల్పోయారు. తరువాత సోమశేఖర్, రూపా దంపతులు గ్రామస్తుల సహాయంతో సచివాలయం కార్యాలయానికి తాళం వేశారు. వైసీపీ నాయకుల మాయమాటలు నమ్మి మేము మోసపోయామని, మాకు వాళ్లు అన్యాయం చేశారని, మాకు న్యాయం చేయాలని సోమశేఖర్, రూపా దంపతులు అధికారులకు చెప్పారు.
వైసీపీ నాయకులు నిర్లక్ష్యం కారణంగా ఈరోజు మేము రోడ్డున పడ్డామని సోమశేఖర్, రూపా దంపతులు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద సీఎం చంద్రబాబు సొంత నియోజక వర్గం కుప్పంలో సచివాలయానికి గ్రామస్తులు తాళం వెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. సోమశేఖర్, రూపా దంపతులకు వైసీపీ నాయకులు అన్యాయం చేశారని, గ్రామంలో సచివాలయం నిర్వహించడానికి మేము ఒప్పుకోమని గ్రామస్తులు అంటున్నారు.












Click it and Unblock the Notifications