తిరుమలలో వీఐపీ దర్శనాలు రద్దు: టీటీడీ
తిరుపతి: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. ఈ నేపథ్యంలో వీఐపీ దర్శనాలను రద్దు చేస్తూ టీటీడీ అధికారులు శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు.
డిసెంబర్ 26 (శుక్రవారం) నుంచి జనవరి 2 వరకు వీఐపీ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు అధికారులు ఈ ఉదయం ప్రకటించారు. అయితే ప్రొటోకాల్ పరిధిలోని విఐపీలకు మాత్రం పరిమిత సంఖ్యలో వీఐపీ దర్శనాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు.

ఏడాదిలో చివరి వారం, నూతన సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో తిరుమలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 20 గంటలు, కాలినడకన భక్తులకు 12 గంటలు సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.












Click it and Unblock the Notifications