చీఫ్ విప్‌లుగా పల్లె, పయ్యావుల నియామకం: అమరావతికి పిలిపించిన బాబు..

Subscribe to Oneindia Telugu

అమరావతి: ఏపీ అసెంబ్లీ, శాసనమండలి చీఫ్ విప్‌లను సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. అసెంబ్లీ చీఫ్ విప్‌గా మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, శాసనమండలిలో చీఫ్ విప్‌గా పయ్యావుల కేశవ్ లకు పదవులు కట్టబెట్టారు.

శుక్రవారం నాడే వీరి ఎంపికపై నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై పల్లె రఘునాథ్ రెడ్డి, పయ్యావుల కేశవ్ లను చంద్రబాబు అమరావతికి పిలిపించి మాట్లాడినట్టు సమాచారం. అందరిని కలుపుకుని వెళ్లాలని, సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించినట్టు తెలుస్తోంది.

vip posts for palle raghunath reddy and payyavula keshav

కాగా, శాసనమండలి ఛైర్మన్ గా ఇప్పటికే ఫరూఖ్ పేరును సీఎం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. పల్లె రఘునాథరెడ్డిని మంత్రి పదవి నుంచి తొలగించిన సమయంలోనే ఆయనకు పదవిపై హామి లభించింది. ఇచ్చిన హామి మేరకు చంద్రబాబు ఆయనకు చీఫ్ విప్ కట్టబెట్టారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AP CM Chandrababu Naidu appointed MLA Palle Raghunath Reddy as chief vip in assemlby and Payyavula Keshav as chief vip in legislative council.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి