విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విష జ్వరాలు ఆరోగ్య శ్రీ పరిధిలో చేరుస్తూ కీలక నిర్ణయం .. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆరోగ్య శాఖ సమీక్షలో అంశాలివే !!

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలని మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విషజ్వరాలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో విష జ్వరాలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి చేరుస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారని వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. ఈరోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

SamanthaAkkineni: స్మైలీ బ్యూటీ సామ్ ఇంట హాట్ గా ఎపుడు చూసి ఉండరు (ఫొటోస్)

ఆరోగ్య శ్రీ పరిధిలోకి విషజ్వరాలు .. సీఎం జగన్ నిర్ణయం

ఆరోగ్య శ్రీ పరిధిలోకి విషజ్వరాలు .. సీఎం జగన్ నిర్ణయం


ముఖ్యంగా రాష్ట్రంలో శిశుమరణాలు తగ్గించాలని పేర్కొన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్రవ్యాప్తంగా ఫ్యామిలీ హెల్త్ డాక్టర్ కాన్సెప్ట్ పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్యంపై నిరంతర పరిశీలన ఉండాలని, రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించాలని ఆయన తెలిపారు. రాష్ట్రంలో నమోదవుతున్న డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వంటి వైరల్ ఫీవర్స్ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని, కేసులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. ప్రజలు వైద్యం కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు విష జ్వరాలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు.

కరోనా నియంత్రణకు జగన్ కీలక ఆదేశాలు .. థర్డ్ వేవ్ పై ప్రణాళిక

కరోనా నియంత్రణకు జగన్ కీలక ఆదేశాలు .. థర్డ్ వేవ్ పై ప్రణాళిక

ఇదే సమయంలో మెడికల్ కళాశాలలో పీజీ కోర్సులు ప్రారంభమయ్యేలా చూడాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. కరోనా థర్డ్ వేవ్ సమాచారం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోవిడ్ నియంత్రణకు నూతన చికిత్సా విధానాలపై దృష్టి సారించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు. కరోనా థర్డ్ వేవ్ ను ఎదుర్కోవడానికి అధికారులు సిద్ధం చేసిన ప్రణాళికపై వారు సీఎం జగన్మోహన్ రెడ్డికి వివరించారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ముఖ్యంగా విశాఖ జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. విశాఖ జిల్లాలో 462 డెంగ్యూ, 31 చికెన్ గున్యా, 708 మలేరియా కేసులు నమోదయ్యాయని తెలుస్తుంది. ఈ క్రమంలో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా విష జ్వరాలను ఆరోగ్యశ్రీలో చేర్చి రోగులకు ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించింది.

ఏజెన్సీలలో విషజ్వరాలపై వైద్యాధికారులకు ఆదేశాలు

ఏజెన్సీలలో విషజ్వరాలపై వైద్యాధికారులకు ఆదేశాలు


ఎక్కువ కేసులు ఉన్న చోట స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించాలని, మెడికల్ క్యాంపులు నిర్వహించాలని, విష జ్వరాలను గుర్తించడానికి రెగ్యులర్ ఫీవర్ సర్వేలు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ మురికివాడలు, ఏజెన్సీ ప్రాంతాలలో వైద్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు జగన్. ఎప్పటికప్పుడు మురుగునీరు నిల్వ ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధులపై వైద్యులు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని సీఎం జగన్ తెలిపారు. ఆరోగ్య శాఖ అధికారులు, మున్సిపల్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజల ఆరోగ్య సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు.

ఎక్కడికి వెళ్ళినా, ఏ వైద్యులు చూసినా వ్యక్తిగత హెల్త్ డేటా తెలిసేలా వివరాల నమోదు

ఎక్కడికి వెళ్ళినా, ఏ వైద్యులు చూసినా వ్యక్తిగత హెల్త్ డేటా తెలిసేలా వివరాల నమోదు

రక్తం, నీరు, గాలి మూడింటి పైన పరీక్షలు జరగాలని పేర్కొన్న సీఎం జగన్, విలేజ్ క్లినిక్స్ స్థాయిలో ఈ పరీక్షలు అందుబాటులో ఉండాలని తెలిపారు. హెల్త్ డేటాపై అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, ఎక్కడ పరీక్షలు చేయించుకున్నా, ఎక్కడ చికిత్స తీసుకున్నా గుర్తింపు కార్డు ద్వారా ఆ వివరాలతో కూడిన డేటా అప్లోడ్ చేయాలని సదరు వ్యక్తి వైద్యం కోసం ఎక్కడకు వెళ్ళినా ఈ డేటా వైద్యులకు అందుబాటులో ఉండేలా ఉండాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో కరోనా కారణంగా ఆరోగ్య సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ప్రతీవారం వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం జగన్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

English summary
AP CM YS Jagan Mohan Reddy has taken another crucial decision to provide better healthcare to all the people in the state of Andhra Pradesh. The decision was made to bring the viral fevers under the purview of arogya Sri. Health Minister Alla Nani clarified the decision of AP CM Jagan. During a review meeting with health department officials at the Thadepalli camp office today, CM Jagan Mohan Reddy inquired about the covid situation in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X