Pick talk: అవ్వ తాతలే వైసీపీ స్టార్ క్యాంపెయినర్లు: జగన్ ఊరికే అన్లేదు

YS Jagan Siddham: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. నాలుగో విడత సిద్ధం బహిరంగ సభను నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మధ్యాహ్నం 3 గంటలకు సభ ఆరంభం కాబోతోంది. 3:30 గంటలకు వైఎస్ జగన్ సభా స్థలికి చేరుకోనున్నారు.

రాష్ట్రంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ పొత్తు అనంతరం రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిన నేపథ్యంలో సిద్ధం బహిరంగ సభను మరింత ఆసక్తికరంగా మార్చివేశాయి. అందరి దృష్టీ దీని మీదే నిలిచింది. ఈ పొత్తుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందన ఎలా ఉండబోతోందనేది సిద్ధం సభలో స్పష్టం కానుంది.

Viral Photo An Old Women arrived YSRCP s Siddham meeting at Addanki hours before to start

15 లక్షల మందికి పైగా ప్రజలు హాజరవుతారని వైఎస్ఆర్సీపీ అంచనా వేస్తోంది. గతంలో నిర్వహించిన భీమిలీ, దెందులూరు, రాప్తాడు సభలకు మించిన స్థాయిలో ఇది ఉండబోతోందనే ధీమాను వ్యక్తం చేస్తోంది. 44 నియోజకవర్గాల నుంచి ప్రజలు దీనికి హాజరవుతారని చెబుతోంది.

చివరి సిద్ధం సభ కావడం వల్ల అటు ప్రజల్లోనూ ఆసక్తి ఏర్పడింది. స్వచ్ఛందంగా ఈ సభకు తరలి వస్తోన్నారు. ప్రజలే నా స్టార్ క్యాంపెయినర్లు అంటూ వైఎస్ జగన్ ఎప్పుడూ చెబుతుంటారు. నాకు ఏ స్టార్ క్యాంపెయినర్ అవసరం లేదు.. మీ బిడ్డ ప్రభుత్వంలో మంచి జరిగిన ఇంటిలోని అక్క చెల్లెమ్మలు, అవ్వ తాతలే స్టార్ క్యాంపెయినర్లు.. అంటూ ఇదివరకు అనంతపురం జిల్లా ఉరవకొండ సభలో స్పష్టం చేశారు జగన్.

ఓ వృద్ధురాలు దాన్ని నిజం చేసి చూపించారు. ఎవరి తోడు లేకుండా ఒంటరిగా ఆమె సభా ప్రాంగణానికి వచ్చారు. వేదికకు దగ్గరగా ఉన్న వరుసలో కుర్చీ వేసుకుని కూర్చున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సభ ఆరంభం కావాల్సి ఉండగా.. ఉదయం 7 గంటలకే ఆమె సభా ప్రాంగణానికి చేరుకోవడం ఆసక్తి రేపింది. దీనికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

గతంలో ఎప్పుడూ లేనివిధంగా వలంటీర్ల ద్వారా పించన్ల మొత్తాన్ని లబ్దిదారుల ఇంటి వద్దకే అందజేస్తోండటం.. వృద్ధులకు ఎంతో ప్రయోజనం కలిగిస్తోందనేది అందరికీ తెలిసిన విషయమే. గతంలో అధికారుల చుట్టూ తిరిగే బాధ తప్పిందంటూ వారు సంతోష పడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+